తాంసి ఆదిలాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము ఆదిలాబాదు రెవెన్యూ డివిజన్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలకేంద్రం 19° 41' 17'' ఉత్తర అక్షాంశం మరియు 78° 25' 28'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో మత్తడి వాగు ప్రవహిస్తోంది. పెన్‌గంగ ప్రాజెక్టు వల్ల ఈ మండలానికి ప్రయోజనం కలుగుతుంది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39739. మండలంలో 5 ఎంపీటీసి స్థానాలు, 13 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. వడ్డాడి గ్రామ సమీపంలో మత్తడివాగుపై 8500 ఎకరాల సాగునీటి లక్ష్యంతో మద్యతరహా సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదించారు. మండలంలో మాంగనీసు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి.
అక్టోబరు 11, 2016న మండలంలోని 19 గ్రామాలను విడదీసి కొత్తగా భీంపూర్ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన భీంపూర్ మండలం, తూర్పున ఆదిలాబాదు గ్రామీణ మండలం, ఆగ్నేయాన మావల మండలం, దక్షిణాన తలమడుగు మండలం, పశ్చిమాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. 2016 అక్టోబరు 11 వరకు ఈ మండలం రాష్ట్రంలోనే అతి ఉత్తరాన ఉన్న మండలంగా ఉండేది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 36164. ఇందులో పురుషులు 17944, మహిళలు 18220. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39739. ఇందులో పురుషులు 19630, మహిళలు 20109. రాజకీయాలు: ఈ మండలము బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. మత్తడివాగు ప్రాజెక్టు: వడ్డాడి గ్రామ సమీపంలో మత్తడివాగుపై 8500 ఎకరాల సాగునీటి లక్ష్యంతో మద్యతరహా సాగునీటి ప్రాజెక్టు ప్రతిపాదించారు. 24-8-2009న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ దీన్ని ప్రారంభించారు. కాలరేఖ:
తాంసి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Ambugaon, Bandalnagapur, Ghotkuri, Girgaon, Hasnapur, Jamidi, Kapparla, Palodi, Ponnari, Sawargaon, Tamsi-B, Waddadi
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కప్పర్ల (Kapparla): తాంసి జడ్పీటీసిగా, మండల అధ్యక్షుడిగా పనిచేసిన కౌడల నారాయణ ఈ గ్రామానికి చెందినవారు. ఈయన జూలై 29, 2013న మరణించారు. వడ్డాడి (Waddadi): గ్రామంలో శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఏటా జాతర నిర్వహిస్తారు. వడ్డాడి సమీపంలో మత్తడివాగు ప్రాజెక్టు నిర్మించబడింది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tamsi Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి