ఆదిలాబాదు పట్టణ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఆదిలాబాదు మండలం విభజితమై కొత్తగా ఆదిలాబాదు పట్టణ మండలం ఏర్పడింది. ఈ మండలము 19° 40' 24'' ఉత్తర అక్షాంశం మరియు 78° 32' 18'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలం మొత్తం పట్టణ ప్రాంతంగా పురపాలక సంఘంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున ఆదిలాబాదు గ్రామీణ మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన మావల మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: ఆదిలాబాదు మండలానికి జాతీయ రహదారి మరియు రైలు సదుపాయము ఉన్నది. దేశంలోనే పొడవైన 44వ నెంబరు జాతీయ రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ముద్‌ఖేడ్ నుంచి ఆదిలాబాదుకు రైలుమార్గం కూడా ఉంది. రాజకీయాలు: ఈ మండలము ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
ఆదిలాబాదు పట్టణ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Adilabad , Khanapur, Bhukthapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆదిలాబాదు (Adilabad): ఆదిలాబాదు పట్టణం మండల మరియు జిల్లా కేంద్రము. రాష్ట్రకూటుల కాలంలో ఇది ఎడ్లవాడగా పిలువబడింది. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరుమీదుగా ఆదిలాబాదు వచ్చినది. ఇది 19డి 67' ఉత్తర అక్షాంశం, 78డి 53' తూర్పు రేఖాంశంపై ఉంది. మహారాష్ట్రకు సమీపంలో ఉండుటచే ఇక్కడ మరాఠి సంస్కృతి అధికంగా ఉంది. పట్టణంలో పత్తి ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. ఆదిలాబాదు రైల్వేస్టేషన్ దక్షిణ మధ్య రైల్వేలో హైదరాబాదు - ముద్ఖేడ్ మార్గంలో ఉంది. రంజన్ల తయారీలో ఆదిలాబాదు ప్రసిద్ధి చెందినది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Adilabad urban Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి