ఆదిలాబాదు గ్రామీణ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఆదిలాబాదు మండలంను విభజించి ఆదిలాబాదు పట్టణ, ఆదిలాబాదు గ్రామీణ మరియు మావల మండలాలను ఏర్పాటుచేశారు. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 34 గ్రామపంచాయతీలు, 38 రెవెన్యూ గ్రామాలు కలవు. ఆదిలాబాదు గ్రామీణ మండలం యాపల్‌గూడలో సిమెంట్ కర్మాగారం నిర్మిస్తున్నారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన జైనాథ్ మండలం, తూర్పున బేల మండలం, దక్షిణాన ఇంద్రవెల్లి మండలం, నైరుతిన గుడిహత్నూర్ మండలం, పశ్చిమాన ఆదిలాబాదు పట్టణ మరియు మావల మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి మరియు రైలుమార్గం (ముద్‌ఖేడ్ నుంచి ఆదిలాబాదు) వెళ్ళుచున్నాయి. రాజకీయాలు: ఈ మండలము ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. వ్యవసాయం, నీటిపారుదల: మండలంలో పండించే ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు. ఖనిజాలు: ఆదిలాబాదు మండలంలో మాంగనీసు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. మండలంలోని చాందా (టి), జిందాపూర్ లలో బూగర్భం గనుల శాఖల నుంచి మాంగనీసు లీజుదార్లకు అనుమతి ఉంది.
ఆదిలాబాదు గ్రామీణ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Ankapur, Ankoli, Anukunta, Arli (Buzrug), Ashodaburki, Belluri, Bheemseri, Burnoor, Chanda-T, Chichdhari, Chinchughat, Dimma, Ganeshpur, Hattigutta, Jamdapur, Jamuldhari, Kachkanti, Khanapur, Khandala, Kottur, Kumbajhari, Landasangvi, Lohara, Lokari, Maleboregaon, Mallapur, Maregaon, Nishaghat, Pippaldhari, Pochera, Ramai, Ramampur (Royati), Takli, Tantoli, Taroda (Srimath), Tippa, Wanwat, Yapalguda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
పొచ్చర్ల (Pocharla): పొచ్చర్ల ఆదిలాబాదు జిల్లా ఆదిలాబాదు గ్రామీణ మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో పరిశ్రమలు విస్తరించియున్నాయి.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Adilabad Rural Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి