చింతలమానేపల్లి కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఇది ప్రాణహిత నది ఒడ్డున ఉంది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలపరిధిలో అర్కగూడ ప్రాజెక్టు నిర్మించబడింది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. కౌటాలా మండలంలోని 10 గ్రామాలు, బెజ్జూరు మండలంలోని 9 గ్రామాలు, సిర్పూర్-టి మండలంలోని 2 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన మరియు తూర్పున చింతలమానేపల్లి మండలం, పశ్చిమాన సిర్పూర్-టి మండలం, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. రవాణా సౌకర్యాలు: మండలమునకు రైలు మరియు జాతీయ రహదారి సౌకర్యం లేదు. సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ సిర్పూర్. కౌటా;ల నుంచి సిర్పూర్, బెజ్జూర్ వైపు వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంది.. రాజకీయాలు: ఈ మండలము సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఈ మండలమునకు చెందిన పాల్వాయి పురుషోత్తమరావు, పాల్వాయి రాజ్యలక్ష్మి సిర్పూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
చింతలమానేపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Adepally, Babapur, Babasagar, Balaji Ankoda, Bandepally (D), Burepalle, Buruguda, Chintala Manepally, Chittam, Dabba, Dimda, Gangapur, Gudem, Karjavelli, Kethini, Korsini, Koyapalle, Ranvalli, Ravindranagar, Rudrapur, Shivapalle
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బాబాసాగర్ (Babasagar): బాబాసాగర్ కొమరంభీం జిల్లా చింతలమానేపల్లి మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిధిలో అర్కగూడ ప్రాజెక్టు నిర్మించబడింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Chintalamanepally Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి