ఇంద్రవెల్లి ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. మండలము 19° 30' 00'' ఉత్తర అక్షాంశం మరియు 78° 40' 39'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47435. ఇంద్రవెల్లి మండలం ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఆదిలాబాదు జిల్లాలో ఈ మండలం కోడ్ సంఖ్య 7. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 25 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న ఇంద్రవెల్లి మండలంలోని 9 రెవెన్యూ గ్రామాలను కొత్తగా ఏర్పడిన సిరికొండ మండలంలో కలిపారు.
ప్రసిద్ధమైన నాగోబా జాతర జరిగే కేస్లాపూర్, చారిత్రక ప్రాధాన్యత కల్గిన పులిమడుగు, త్రివేణి సంగం ప్రాజెక్టు నిర్మించిన ముత్నూరు ఈ మండలానికి చెందిన గ్రామాలు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆదిలాబాదు గ్రామీణ మండలం, తూర్పున నార్నూర్ మండలం మరియు ఉట్నూరు మండలం, దక్షిణాన సిరికొండ మండలం, పశ్చిమాన గుడిహత్నూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం ఇంద్రవెల్లి మండల జనాభా 38642. ఇందులో పురుషులు 19045, మహిళలు. మండల జనాభాలో 60% పైగా షెడ్యూల్ తెగల వారున్నారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47435. ఇందులో పురుషులు 23602, మహిళలు 23833. రవాణా సౌకర్యాలు: మండలానికి జాతీయ రహదారి, రైలు రవాణా సదుపాయము లేదు. పశ్చిమం నుంచి సరిహద్దులుగా ఉన్న గుడిహత్నూరు, ఆదిలాబాదు మండలాల నుంచి జాతీయ రహదారి వెళ్ళుచున్నది. ఇంద్రవెల్లి నుంచి జాతీయ రహదారిని కలిపే రహదారి ఉంది. రైలురవాణా కూడా సరిహద్దున ఉన్న ఆదిలాబాదు మండలం నుంచి వెళ్ళుచున్నది. సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ ఆదిలాబాదు. రాజకీయాలు: ఈ మండలము ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
ఇంద్రవెల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Anji, Bursanpatar, Dasnapur, Devapur, Dhannura (B), Dhannura (K), Dodanda, Dongargaon, Gattepalle, Ginnera, Goureepur, Harkapur, Heerapur, Indervelly (B), Indervelly (K), Keslaguda, Keslapur, Mamidiguda, Mendapalle, Muthnur, Pipri, Tejapur, Wadagaon, Walganda Heerapur, Yamaikunta
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అందునాయక్ తాండ (Andunaik Tanda): అందునాయక్ తాండ ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలమునకు చెందిన గ్రామము. నవంబరు 16, 2003న కార్గిల్ పోరాటంలో గ్రామానికి చెందిన గుత్తే ప్రకాశ్ వీరమరణం పొందాడు. ప్రకాశ్ తల్లి లారీబాయికి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం శౌర్యచక్ర పతకం ప్రధానం చేశారు. ప్రకాశ్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటుచేశారు. కేస్లాపూర్ (Keslapur): కేస్లాపూర్ ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలమునకు చెందిన గ్రామము. గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా ఆలయం ఉంది. ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తారు. జిల్లా నుంచే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల నుంచి గిరిజనులు తరలివస్తారు. ముత్నూరు (Mutnur): ముత్నూరు ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలమునకు చెందిన గ్రామము. 2007-08లో నాబార్డు నిధులతో ముత్నూరులో త్రివేణి సంగం ప్రాజెక్టు నిర్మించారు. 800 ఎకరాలకు సాగు నీరు అందించడం దీని లక్ష్యం.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Indravelli Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి