ఉట్నూర్ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 23' 00'' ఉత్తర అక్షాంశం మరియు 78° 20' 29'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో శివసాగర్ ప్రాజెక్టు, మత్తడి ప్రాజెక్టు ఉన్నాయి. ఈ మండలము ఉట్నూరు రెనెన్యూ డివిజన్, ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62945. మండలంలో పండించే ప్రధాన పంత జొన్నలు. మండలంలో ఇనుప ఖనిజ నిక్షేపాలున్నాయి. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 36 గ్రామపంచాయతీలు, xx రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఇంద్రవెల్లి మండలం, ఈశాన్యాన నార్నూర్ మండలం, పశ్చిమాన సిరికొండ మండలం, తూర్పున ఆసిఫాబాదు జిల్లా, దక్షిణాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 53578. ఇందులో పురుషులు 27474, మహిళలు 26104. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 62945. ఇందులో పురుషులు 31859, మహిళలు 31086. పట్టణ జనాభా 16107 కాగా గ్రామీణ జనాభా 46838. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుసౌకర్యము మరియు జాతీయ రహదారి సదుపాయము లేదు. పశ్చిమాన సరిహద్దుగా ఉన్న ఇచ్ఛోడమండలం గుండా 44వ నెంబరు జాతీయ రహదారి వెళ్ళుచున్నది.ఆసిఫాబాదు నుంచి జాతీయ రహదారిని కలిపే రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
ఉట్నూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కన్నాపూర్ (Kannapur):కన్నాపూర్ ఉట్నూరు మండలమునకు చెందిన గ్రామము. గ్రామసమీపం నుంచి వాగు ప్రవహిస్తోంది. దీనికి కన్నాపూర్ వాగుగా పిలుస్తారు. మత్తడిగూడ (Mattadiguda): మత్తడిగూడ ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలమునకు చెందిన గ్రామము. 2003-04లో నాబార్డు నిధులతో 1250 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఛాప్రాలమత్తడి ప్రాజెక్టు నిర్మించబడింది.
నాగాపూర్ (Nagapur):
నాగాపూర్ ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలమునకు చెందిన గ్రామము. 2003-04లో నాబార్డు నిధులతో నాగాపూర్ గ్రామంలో 2వేల ఎకరాల సాగునీటి శివసాగర్ ప్రాజెక్టు నిర్మించబడింది.
సాలెవాడ (Salewada):
సాలెవాడ ఆదిలాబాదు జిల్లా ఉట్నూరు మండలమునకు చెందిన గ్రామము. మండల కేంద్రానికి 15 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ పురాతనమైన హరిహర మహాదేవుని ఆలయం ఉంది. 5వేల సంవత్సరాల శిథిల ఆలయాన్ని గ్రామస్థులు పునర్మించుకున్నారు. సాలెవాడ్(కె)లో సాగునీటి ప్రాజెక్టు ఉంది.
ఉట్నూరు (Utnur):
ఉట్నూరు ఆదిలాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. మండలంలో ఇదే అతిపెద్ద గ్రామము. ఉట్నూరులో పట్టు పరిశ్రమ అబివృద్ధి చెందింది. ఈ గ్రామానికి చెందిన మెస్రం మనోహర్ ఆదివాసీల చరిత్ర, సంస్కృతిపై పలు పుస్తకాలు రచించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Utnoor or Utnur Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి