(నిజామాబాదు జిల్లా సిరికొండ మండల వ్యాసం కోసం ఇక్కడ చూడండి) సిరికొండ ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. అక్టోబరు 11 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. ఇంద్రవెల్లి మండలంలోని 9 రెవెన్యూ గ్రామాలు, ఇచ్ఛోడ మండలంలోని 7 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. ఈ మండలం మండలం ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 1986కు ముందు ఈ మండలంలోని గ్రామాలు ఉట్నూరు తాలుకాలో భాగంగా ఉండేవి.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన గుడిహత్నూర్ మరియు ఇంద్రవెల్లి మండలాలు, తూర్పున ఉట్నూరు మండలం, పశ్చిమాన ఇచ్ఛోడ మండలం, దక్షిణాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: మండలానికి జాతీయ రహదారి, రైలు రవాణా సదుపాయము లేదు. పశ్చిమం నుంచి సరిహద్దులుగా ఉన్న గుడిహర్నూరు, ఇచ్ఛోడ మండలాల నుంచి జాతీయ రహదారి వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఇచ్ఛోడ మండలమే బోథ్ నియోజకవర్గంలో కీలకంగా ఉంది. మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Dharmasagar, Kondapur, Lachimpur (B), Lachimpur (K), Lakampur, Mallapur, Narayanpur, Neradigonda G, Neradigonda K, Pochampalle, Ponna, Rampur (B), Sirikonda, Soanpally, Sunkidi, Waipet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sirikonda Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి