జైనూరు కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. జైనూరు కొమురంభీం జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 25' 00'' ఉత్తర అక్షాంశం మరియు 78° 58' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. కోకగూడలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించబడింది. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 26 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు.
ఆదివాసుల హక్కుల కోసం జల్, జమీన్, జంగల్ కోసం నిజాం సర్కారుతో పోరాడి వీరమరణం పొందిన కొమురంభీమ్ స్థలం మండలంలోనే ఉంది. ఆదివాసుల జీవనప్రమాణాలు, స్థితిగతులు శాస్త్రీయ పథంలో పరిశోధించడానికి ఈ గ్రామానికి ఇంగ్లాండుకు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త బెట్టి ఎలిజబెత్, హేమన్ డార్ఫ్ దంపతుల సమాధులు మార్లవాయిలో ఉన్నాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున కెరామెరి మండలం, దక్షిణాన సిర్పూర్-యు మండలం, పశ్చిమాన ఆదిలాబాదు జిల్లా, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 23487. ఇందులో పురుషులు 11964, మహిళలు 11523. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 31467. ఇందులో పురుషులు 15786, మహిళలు 15681. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుసదుపాయము, జాతీయ రహదారి సౌకర్యం లేదు. ఆసిఫాబాదు నుంచి జాతీయ రహదారిని కలిపే మార్గం మండలం గుండా వెళ్తుంది. సిర్పూర్, కెరామెరి, ఉట్నూరుల నుంచి రోడ్డు సౌకర్యం ఉంది. రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. ఈ మండలానికి చెందిన సి.మాధవరెడ్డి 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 2019లో జైనూర్ జడ్పీటీసిగా విజయం సాధించిన కోవలక్ష్మి జడ్పీ చైర్మెన్ అయ్యారు.
జైనూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Addesar, Ashapalle, Bhusimatta, Daboli, Dubbaguda, Gudamamda, Jainoor, Jamgaom, Jamni, Jendaguda, Lendiguda, Marlawai, Patnapur, Polasa, Powerguda, Rasimatta, Shivanur, Ushegaon
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఆరేపల్లి (Arepaly): ఆరేపల్లి కొమురంభీం జిల్లా జైనూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది ప్రముఖ రాజకీయ నాయకుడు లోకసభ సభ్యునిగా పనిచేసిన సి.మాధవరెడ్డి స్వగ్రామం. ఈయన 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు.
కోకగూడ (Kokaguda):
కోకగూడ కొమురంభీం జిల్లా జైనూర్ మండలమునకు చెందిన గ్రామము. 2005-06లో నాబార్డు నిధులతో 950 ఎకరాలకు సాగునీరు అందించడానికి కోకగూడలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించబడింది.
మార్లవాయి (Marlavai):
మార్లవాయి కొమురంభీం జిల్లా జైనూర్ మండలమునకు చెందిన గ్రామము. ఆదివాసుల హక్కుల కోసం జల్, జమీన్, జంగల్ కోసం నిజాం సర్కారుతో పోరాడి వీరమరణం పొందిన కొమురంభీమ్ స్థలం. కొమురంభీం మరణం తర్వాత ఆదివాసుల జీవనప్రమాణాలు, స్థితిగతులు శాస్త్రీయ పథంలో పరిశోధించడానికి ఈ గ్రామానికి ఇంగ్లాండుకు చెందిన మానవ పరిణామ శాస్త్రవేత్త బెట్టి ఎలిజబెత్, హేమన్ డార్ఫ్ దంపతులు వచ్చారు. వీరి విగ్రహాలు గ్రామంలో ప్రతిష్టించారు. ఈ దంపతుల సమాధులు కూడా గ్రామంలోనే ఉన్నాయి. ఏప్రిల్ 2010లో ఆంధ్రప్రదేశ్ గవర్నరు నరసింహన్ గ్రామాన్ని సందర్శించారు.
పెగడపల్లి (Pegadapalli):
పెగడపల్లి కొమురంభీం జిల్లా జైనూరు మండలమునకు చెందిన గ్రామం. ఇక్కడ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం 600 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
jainur Jainoor Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి