కౌటాల కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 31' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 45' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఇది ప్రాణహిత నది ఒడ్డున ఉంది. జడ్పీ చైర్మెన్ గా పనిచేసిన గణపతి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 20 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న కౌతాలా మండలంకు చెందిన 10 గ్రామాలు కొత్తగా ఏర్పాటు చేసిన చింతలమానేపల్లి మండలంలో కలిపారు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన మరియు తూర్పున చింతలమానేపల్లి మండలం, పశ్చిమాన సిర్పూర్-టి మండలం, ఉతరాన మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది.. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 44929. ఇందులో పురుషులు 22599, మహిళలు 22330. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51039. ఇందులో పురుషులు 25891, మహిళలు 25148. రవాణా సౌకర్యాలు: కౌటాల మండలమునకు రైలు మరియు జాతీయ రహదారి సౌకర్యం లేదు. సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ సిర్పూర్. కౌటాల నుంచి సిర్పూర్, బెజ్జూర్ వైపు వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంది. రాజకీయాలు: ఈ మండలము కాగజ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
కౌటాల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Bhalepalle, Chandaram (D), Chipurudubba, Gudlabori, Gundaipet, Gurudpet, Kanki, Kannepalle, Kouthala, Kumbari, Mogadagad, Muthampet, Nagepalle, Pardi, Sandgaon, Talodi, Tatipalle, Thumbadihatti, Veerdandi, Veervalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కౌటాల (Kawtala): కౌటాల కొమురంభీం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. కంకాళమ్మ గుట్టపై కేతేశ్వరస్వామి ఆలయం ఉంది. 2005 నుంచి ఏటా జాతర నిర్వహిస్తారు. తుమిడీ (Tumidi): తుమిడి కొమురంభీం జిల్లా కౌటాల మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడే పెన్‌గంగ మరియు వార్థానదులు కలిసి ప్రాణహిత నదిగా ఆవిర్భవిస్తుంది. ఈ గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ప్రాణహిత ప్రాజెక్టు తుమిడి గ్రామ సమీపంలోనే ఉంది. కౌటాల నుంచి 16 కిమీ దూరం ఉన్న తుమిడిహెట్టిలో 2010 ప్రాణహిత పుష్కరాల సందర్భంగా ఘాట్‌ను ఏర్పాటుచేశారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kowtala Koutala Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి