కాగజ్‌నగర్ కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 23' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 28' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఈ మండలంలోని పెద్దవాగుపై జగన్నాథపురం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ మండలము కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 110149. మండలంలో పండించే ప్రధాన పంటలు వరి, జొన్నలు. మండలం గుండా కాజీపేట-ఢిల్లీ రైలుమార్గం వెళ్ళుచున్నది. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 28 గ్రామపంచాయతీలు, 38 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మహారాష్ట్ర మరియు సిర్పూర్-టి మండలం, తూర్పున బెజ్జూరు మండలం, ఈశాన్యాన చింతల మానేపల్లి మండలం, ఆగ్నేయాన పెంచికలపేట్ మండలం, దక్షిణాన దహెగాం, రెబ్బెన మరియు మంచిర్యాల జిల్లా, పశ్చిమాన ఆసిఫాబాదు మండలం, వాంకిడి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 104001. అందులో పురుషులు 52628, మహిళలు 51373. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 110149. ఇందులో పురుషులు 55278, మహిళలు 54871. పట్టణ జనాభా 57876 కాగా గ్రామీణ జనాభా 52273. అక్షరాస్యత శాతం 71.95%. రవాణా సౌకర్యాలు: కాజీపేట-బల్హర్షా రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. కాగజ్ నగర్‌లో రైల్వేస్టేషన్ ఉంది. మండలానికి జాతీయ రహదారి సౌకర్యం లేదు. ఆసిఫాబాదు, సిర్పూల్ ల నుంచి రోడ్డు సౌకర్యం ఉంది. రాజకీయాలు: ఈ మండలము సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గజ్జి రామయ్య ఎనికయ్యారు. 2010లో ఆయన మార్కెట్ యార్డు కమిటీ చైర్మెన్‌గా ఎన్నికై జడ్పీటీసికి రాజీనామా చేశారు.
కాగజ్‌నగర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Andavelli, Ankhoda, Ankusapur, Bareguda, Bhatpalle, Bodepalle, Boregaon, Boregaon, Chinthaguda, Dubbaguda, Easgaon, Gannaram, Gondi, Jagannathpur, Jambuga, Jankapur, Kadamba, Kagaznagar (M), Kosni, Kothapet, Lanjaguda, Mahajanguda, Malni, Mandva, Marepalle, Metindhani, Metpalle, Mosam, Nagampet, Nandiguda, Narapur, Nazrulnagar, Raspalle, Regulguda, Sarsala, Seetanagar, Vallakonda, Vanjiri
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఈజ్ గాన్ (Easgaon): ఈజ్ గాన్ కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ చరిత్ర కలిగిన శివమల్లన్నస్వామి ఆలయం ఉంది.
కాగజ్‌నగర్ (Kagaznagar):
కాగజ్‌నగర్ కొమురంభీం జిల్లా కు చెందిన పట్టణము, మండల కేంద్రము మరియు రెవెన్యూ డీవిజన్ కేంద్రము. ఇది పురపాలక సంఘంగా ఉంది. పేపరు, సర్ సిల్క్ పరిశ్రమతో పట్టణం అభివృద్ధి చెందింది. ఇది పూర్వం కొత్తపేటగా పిలువబడింది. పేపరు మిల్లు స్థాపించిన పిదప కాగజ్ నగర్ అయింది. కాగజ్‌నగర్‌లో 1938లో సిర్పూర్ పేపర్ మిల్లును, 1939లో సర్‌సిల్క్ మిల్లును స్థాపించారు. సర్‌సిల్క్ మిల్లు 1991లో మూతపడింది. కాజీపేట -ఢిల్లీ మార్గంలో కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ ఉంది.
మాలిని (Malini):
మాలిని కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలమునకు చెందిన గ్రామము. మండల కేంద్రం నుంచి 36 కిమీ దురంలో ఉంది. 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం రాష్ట్రంలో సిర్పూర్ ఒకటవ నెంబరు నియోజకవర్గం కాగా, సిర్పూర్‌లో మాలిని ఒకటవ నెంబరు పోలింగ్ కేంద్రము. అంటే రాష్ట్రంలోనే తొట్టతొలి ఓటరు మాలినికి చెందినవారు.
నజ్రుల్ నగర్ (Najrulnagar):
నజ్రుల్ నగర్ కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఇక్కడ బంగ్లాదేశ్ కాందీశీకులు అధిక సంఖ్యలో ఉన్నారు. 1964లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన శరణార్థులకు కేంద్రం ఇక్కడ ఆశ్రమం కల్పించింది. సైన్యంలో అధికమంది (500+) పనిచేస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kagaz nagar Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి