లింగాపూర్ కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము ఉట్నూరు రెవెన్యూ డివిజన్, ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 14 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు సిర్పూర్-యు మండలంలో ఉన్న 10 గ్రామాలు మరియు తిర్యాని మండలంలోని ఒక గ్రామంతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన జైనూర్ మండలం, ఈశాన్యాన కెరామెరి మండలం, తూర్పున ఆసిఫాబాదు మండలం, దక్షిణాన మంచిర్యాల జిల్లా, పశ్చిమాన నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి జాతీయ రహదారి కాని రైలుమార్గం సదుపాయం కాని లేదు. రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2019లో లింగాపూర్ మండలం అధ్యక్షురాలిగా సవితాబాయి ప్రేమ్ కుమార్ ఎన్నికయ్యారు.
లింగాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chorpalle, Ghumnur (Buzurg), Ghumnur (Khurd), Jamuldhara, Kanchanpalle, Kothapalle, Lingapur, Loddiguda, Mamidipalle, Vankamaddi, Yellapatar
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఎల్లపట్టార్ (Yellapattar): ఎల్లపట్టార్ కొమరంభీం జిల్లా లింగాపూర్ మండలంకు చెందిన గ్రామం. జనవరి 2020లో సమత హత్యాచార సంఘటనతో ఈ గ్రామం వార్తల్లోకి వచ్చింది..
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Lingapur Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి