పెంచికలపేట కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఇది జిల్లాలో తూర్పువైపున ప్రాణహిత నది తీరాన ఉన్నది. ఈ మండలంలోని అన్ని గ్రామాలు పూర్వపు సిర్పూర్ తాలుకాలోనివే. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 12 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో నందిగామ గుట్టలు, పాలరాపుగుట్టలు ఉన్నాయి. మండలం గుండా పెద్దవాగు ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. బెజ్జూరు మండలంలోని 15 గ్రామాలు, కాగజ్‌నగర్ మండలంలోని 2 గ్రామాలు, దహేగాన్ మండలంలోని ఒక గ్రామంతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన బెజ్జూరు మండలం, దక్షిణాన దహేగాన్ మండలం, వాయువ్యాన కాగజ్‌నగర్ మండలం, తూర్పున మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలుసౌకర్యంకాని, జాతీయ రహదారి సౌకర్యంకాని లేదు. పశ్చిమాన సరిహద్దుగా ఉన్న కాగజ్‌నగర్ మండలం మీదుగా రైల్వేలైన్ వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
పెంచికలపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Agarguda, Bombaiguda, Chedwai, Gannaram, Gundepalle, Guntlapet, Jilleda, Kammergaon, Kondapalle, Koyachichal, Lodpalle, Muraliguda, Nandigaon, Penchikalpet, Pothepalle, Tellapally (D), Yelkapalle, Yellur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Penchikalpet Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి