బేల ఆదిలాబాదు జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 43' 13'' ఉత్తర అక్షాంశం మరియు 78° 46' 46'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఈ మండలం జిల్లా ఉత్తరభాగంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. మండలంలోని సదల్‌పూర్ గ్రామంలో పురాతనమైన శివలయం భైరవాలయం ఉంది. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 37 గ్రామపంచాయతీలు, 47 రెవెన్యూ గ్రామాలు కలవు.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మరియు తూర్పున మహారాష్ట్ర, ఆగ్నేయాన గడిగూడ మండలం, దక్షిణాన ఆదిలాబాదు గ్రామీణ మండలం, పశ్చిమాన జైనాథ్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 32970. ఇందులో పురుషులు 16694, మహిళలు 16276. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38380. ఇందులో పురుషులు 19471, మహిళలు 18909. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము ఆదిలాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బాది (Badi): బాది ఆదిలాబాదు జిల్లా బేల మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో నందీశ్వరాలయం ఉంది. సదల్‌పూర్ (Sadalpur): సదల్‌పూర్ ఆదిలాబాదు జిల్లా బేల మండలంలోని గ్రామము. గ్రామ సమీపంలో గిరిజనులు ఆరాధించే భైరందేవుని ఆలయం ఉంది. మహాశివుని ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఇది శాతవాహనుల కాలంలో నిర్మించబడింది. బేల నుంచి చంద్రాపూర్ వెళ్ళుమార్గంలో 5 కిమీ తర్వాత ఈ గ్రామం ఉంది. ఇక్కడి శిల్పకళ గొప్పది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bela Mandal, Adilabad Dist (district) Mandal in telugu, Adilabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి