జన్నారం మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 09' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 00' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. 15 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 26 రెవెన్యూ గ్రామాలు కల్గిన ఈ మండలం దక్షిణ సరిహద్దుగా గోదావరి నది ప్రవహిస్తోంది. 1989లో జిన్నారంలో జింకల సంరక్షణ కేంద్రం ప్రారంభించబడింది. కవ్వాల్ పులుల అభయారణ్యం ఈ మండల పరిధిలో కూడా వస్తుంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో పశ్చిమంలో మొనదేలినట్లుగా ఉంది. ఆగ్నేయాన దండేపల్లి మండలం మినహా మిగితా అన్నివైపులా ఇతర జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరాన కొమురంభీం జిల్లా, పశ్చిమాన మరియు దక్షిణమున నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. రవాణా సౌకర్యాలు: ఈ మండలంలో రైలుమార్గం లేదు. నిర్మల్ నుంచి 16వ నెంబరు జాతీయ రహదారిని కలిపే ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 49464. ఇందులో పురుషులు 24782, మహిళలు 24682. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53104. ఇందులో పురుషులు 26370, మహిళలు 26734.
జన్నారం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Badampalle, Bommena, Chintaguda, Dharmaram, Dongapalle ,Indhanpalle, Jannaram, Juvviguda, Kalmadagu, Kamanpalle, Kawal, Kishtapur,, Kothapet, Malyal, Marriguda, Murimadugu, Narsingapur, Paidpalle, Papammaguda, Ponakal, Puttiguda, Raindlaguda, Rampur, Singaraipet, Thimmapur, Venkatapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చింతగూడ (Chintaguda): చింతగూడ మంచిర్యాల జిల్లా జన్నారం మండలమునకు చెందిన గ్రామము. మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి. ఈ గ్రామం గోదావరి నది సరిహద్దులో ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో గ్రామంవద్ద పుష్కర ఘాట్ ఏర్పాటుచేయబడింది.
కలమడుగు (Kalamadugu):
కలమడుగు మంచిర్యాల జిల్లా జన్నారం మండలమునకు చెందిన గ్రామము. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతర సమయంలో మెస్రం వంశీయులు పవిత్ర గోదావరి జలాలను ఇక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఈ పంచాయతి పరిధిలోని రామూనాయక్ తండాకు చెందిన శర్మన్ జనవరి 11, 2012న మహబూబ్‌నగర్ జిల్లా జాయింట్ కలెక్టరుగా నియమించబడ్డారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Jannaram Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి