లక్సెట్టిపేట మంచిర్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 18° 55' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 13' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలం గుండా కడెంనది. మండల దక్షిణ సరిహద్దుగా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వూవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాలో భాగంగా మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున హాజీపూర్ మండలం, ఉత్తరాన కాసిపేట మండలం, పశ్చిమాన దండేపల్లి మండలం, దక్షిణాన జగిత్యాల జిల్లా సరిహద్దుగా ఉంది. రవాణా సౌకర్యాలు: మండలానికి రైలుసదుపాయము లేదు. తూర్పున ఉన్న మంచిర్యాల నుంచి రైల్వేలైన్ ఉంది. నిజామాబాదు నుంచి ఛత్తీస్‌ఘఢ్ వెళ్ళే 16వ నెంబరు జాతీయ రహదారి మండలం నుంచి వెళ్ళుచున్నది. నిర్మల్ నుంచి 16వ నెంబరు జాతీయ రహదారినికి కలిపే ప్రధాన రహదారి కూడా ఈ మండలంలోనే కలుస్తుంది. రాజకీయాలు: ఈ మండలము మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నియోజకవర్గం కేంద్రంగా ఉండేది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46755. ఇందులో పురుషులు 23238, మహిళలు 23517. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50894. ఇందులో పురుషులు 25241, మహిళలు 25653. పట్టణ జనాభా 11401 కాగా గ్రామీణ జనాభా 39493.
లక్సెట్టిపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Balraopet, Challampet, Chandram, Dowdepalle, Ellaram, Gullakota, Itkyal, Jendavenkatapur, Kothur, Laxmipur, Lingapur, Luxettipet, Mittapally, Modela, Patha Kommugudem , Pothepalle, Rangapet, Talamalla, Thimmapur, Utukur, Venkataraopet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఎల్లారం (Ellaram): ఎల్లారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. ఈ పంచాయతికి 2008లో నిర్మల్ పురస్కారం లభించింది. లక్సెట్టిపేట (Laxettipet): లక్సెట్టిపేట మంచిర్యాల జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. మండల వ్యవస్థకు పూర్వం ఇది తాలుకా కేంద్రంగా ఉండేది. 1952 నుంచి 2009 వరకు అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉండింది. లక్సెట్టిపల్లిలో పురాతనమైన చర్చి ఉంది. జిల్లా కేంద్రం మంచిర్యాల నుంచి 25 కిమీ దూరంలో ఉన్న ఈ పట్టణం 16వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది.
కొత్తూరు (Kothur):
కొత్తూరు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపల్లి మండలమునకు చెందిన గ్రామము. కొత్తూరులో గత 6, 7 దశాబ్దాలుగా ఆస్తమా రోగులకు పెండ్యాల కుటుంబీకులు ఉచిత చేపమందు పంపిణీ చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Laxettipet Mandal, Mancherial Manchiryal Dist (district) Mandal in telugu, Mancherial Manchiryal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి