సిర్పూర్ టి కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 29' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 36' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 16 గ్రామపంచాయతీలు, 23 రెవెన్యూ గ్రామాలు కలవు. వెంకట్రావుపేట , మహారాష్ట్రలోని పోడిషం గ్రామాల మధ్యన పెన్‌గంగ నదిపై వారధి నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు గోపాల్ శంకర్ దండేకర్ సిర్పూర్ సమీపంలోని సిరోంచ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధిచేశారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన కొమరంభీం ఆసిఫాబాదు జిల్లాలో చేరింది. అదేసమయంలో అక్టోబరు 11, 2019న ఈ మండలంలోని 2 గ్రామాలు కొత్తగా ఏర్పాటుచేసిన చింతల మానేపల్లి మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున కౌటాలా మండలం, ఆగ్నేయాన చింతలమానేపల్లి మండలం, దక్షిణాన మరియు పశ్చిమాన కాగజ్‌నగర్ మండలం, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 29105. ఇందులో పురుషులు 14923, మహిళలు 14182. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 31183. ఇందులో పురుషులు 15643, మహిళలు 15540. రవాణా సౌకర్యాలు: సిర్పూర్ టి మండలానికి జాతీయ రహదారి సౌకర్యం లేదు. కాజీపేట - బల్హార్షా రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
సిర్పూర్ (టి) మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Achalli, Arepally, Bhupalapatnam, Cheelapalle, Chintakunta, Chunchupalle, Dhorpalle, Garlapet, Heerapur, Hudkili, Jakkapur, Laxmipur, Loanvelly, Makidi, Medpalle, Navegaon, Parigaon, Rajaram, Rudraram, Sirpur, Tonkini, Vempalle, Venkatraopet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
సిర్పూర్ (Sirpur): సిర్పూర్ టి కొమురంభీం జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం కూడా. ఈ గ్రామము కాగితపు పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. వెంకట్రావుపేట (Venkatraopet): వెంకట్రావుపేట కొమురంభీం జిల్లా సిర్పూర్-టి మండలమునకు చెందిన గ్రామము. ఇది పెన్‌గంగ నది ఒడ్డున ఉంది. వెంకట్రావుపేట , మహారాష్ట్రలోని పోడిషం గ్రామాల మధ్యన పెన్‌గంగ నదిపై వారధి నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sirpur T Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి