తిర్యాని కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 12' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 14' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. సింగరేణి బొగ్గుగనులకు చెందిన కైరిగూడ, డోర్లి ఉపరితల గనులు తిర్యాని మండలంలో ఉన్నాయి. మండలంలో చెలిమెలవాగుపై (చెలిమలవాగు ప్రాజెక్టు) ఎన్.టి.ఆర్. సాగర్ ప్రాజెక్టు నిర్మించబడింది. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 39 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన కొమరంభీం ఆసిఫాబాదు జిల్లాలో చేరింది. . భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ఆసిఫాబాదు మండలం, తూర్పున రెబ్బెన మండలం, వాయువ్యాన లింగాపూర్ మండలం, మిగితావైపులా మంచిర్యాల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 22804. ఇందులో పురుషులు 11597, మహిళలు 11207. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 27495. ఇందులో పురుషులు 13714, మహిళలు 13781. రవాణా సౌకర్యాలు: ఈ మండలానికి రైలు మరియు జాతీయ రహదారి సౌకర్యం లేదు. సరిహద్దున ఉన్న రెబ్బెన, తాండూరు మండలాల నుంచి రైల్వే మార్గం వెళ్ళుచున్నది. ఆసిఫాబాదు, దండేపల్లి, రెబ్బెన, కాసిపేటల నుంచి రోడ్డు సౌకర్యం ఉంది. రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము. 2009లో శాసనసభ్యులుగా ఎన్నికైన ఆత్రంసక్కు ఈ మండలానికి చెందినవారు.
తిర్యాని మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Areguda, Bheempur, Boardham, Chintapally, Chopidi, Dantanpalle, Devaiguda, Dondla, Dongargaon, Duggapur, Edulpad, Gadalpally, Gambhiraopet, Gangapur, Ginnedari, Goena, Goyagaon, Gundala, Irkapally, Islampur, Jewni, Kannepally, Korlanka, Koyatalandi, Lingiguda, Mandrumeda, Mangi, Manikyapur, MoindaGudipet, Pangidimadra, Pedakunta, Rallakannepally, Rompally, Rudrapur, Sonapur, Sungapur, Talandi, Tiryani, Ullipitta Dorli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మంగి (Mangi): మంగి కొమురం భీం జిల్లా తిర్యాణి మండలమునకు చెందిన గ్రామము. ఇది పంచాయతి కేంద్రము. గ్రామ ప్రజలు ఎటు వెళ్ళాలన్నా గుర్రాలపై బయలుదేరుతారు. కొండలు, గుట్టలు, అడవులు ఉండటంతో సరిన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తరాల నుంచి గుర్రాలనే వాహనాలుగా వాడుతున్నారు. ఇంటికో గుర్రాన్ని పెంచుకుంటున్నారు. పంగిడిమాదార (Pangidimadara): పంగిడిమాదార కొమురం భీం జిల్లా తిర్యాని మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయ నాయకురాలు ఆత్రంసక్కు, కోవలక్ష్మి ఈ గ్రామానికి చెందినవారు
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tiryani Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి