సిర్పూర్ (యు) కొమురంభీం జిల్లాకు
చెందిన మండలము. ఈ మండలము 19° 18' 00'' ఉత్తర అక్షాంశం మరియు 79° 01' 00'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఈ మండలము ఉట్నూరు రెవెన్యూ డివిజన్, ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 4 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన కొమరంభీం ఆసిఫాబాదు జిల్లాలో చేరింది. అదేసమయంఓ ఈ మండలంలోని 10 గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన లింగాపూర్ మండలంలో కలిపారు. మండలంలో మెట్టే జలపాతం ఉంది. పిట్టగూడ-లింగాపూర్ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో 7 మెట్టె జలపాతాలున్నాయి. వీటిని సప్తగుండాల జలపాతాలందురు. కాకరబుడ్డి సమీపంలో పాతాళలోయగా పేరుపొందిన మర్కలొద్ది ఉంది. రాగాపుర్‌లో సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన జైనూర్ మండలం, తూర్పున కెరామెరి మండలం, ఆసిఫాబాదు మండలం, దక్షిణాన లింగాపూర్ మండలం, పశ్చిమాన ఆదిలాబాదు జిల్లా, నైరుతిన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 21841. ఇందులో పురుషులు 10898, మహిళలు 10943. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 26099. ఇందులో పురుషులు 13014, మహిళలు 13085. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము ఆసిఫాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగము.
సిర్పూర్ (యు) మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Babjipet, Bhurnur, Chapri, Devadpalle, Dhanora-P, Kohinur (Buzurg), Kohinur (Khurd), Mahagaon, Netnur, Pamulawada, Pangdi, Phullara, Raghapur, Seetagondi, Shettihadapnur, Sirpur (U)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
మహగావ్ (Mahagav): మహగావ్ కొమురంభీం జిల్లా సిర్పూర్-యు మండలమునకు చెందిన గ్రామము. గ్రామం ఏర్పడినప్పటి నుంచి మద్యమాంసాలకు దూరంగా ఉంది. 60 సం.ల క్రితం సురోజీ అనే భక్తుడు గుట్ట మీద ఇల్లు కట్టుకొని తపస్సు చేశాడు.క్రమేణా అది గ్రామమైంది. ఆయన మద్యమాంసాలకు దూరంగా ఉండాల్ని చేసిన బోధనలను గ్రామస్థులు ఇప్పటికీ పాటిస్తున్నారు. పిట్టగూడ (Pittaguda): పిట్టగూడ కొమురంభీం జిల్లా సిర్పూర్-యు మండలమునకు చెందిన గ్రామము. ఇది మండల కేంద్రానికి 10 కిమీ దూరంలో ఉన్నది. గ్రామానికి 4 కిమీ దూరంలో పిట్టగూడ, లింగాపూర్ గ్రామాల మధ్య మిట్టె జలపాతం ఉంది. పెద్ద మిట్టె, చిన్న మిట్టె పేరుతో 2 జలపాతాలున్నాయి. రాగాపూర్ (Ragapur): రాగాపూర్ కొమురంభీం జిల్లా సిర్పూర్-యు మండలమునకు చెందిన గ్రామము. 2009లో జేబీఐసీ నిధులతో 740 ఎకరాలకు సాగునీరు అందించేలక్ష్యంతో రాగాపుర్‌లో సాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. గిరిజనుల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు జపాన్ బృదం 21-01-212 నాడు రాగాపుర్ గ్రామంలో పర్యటించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sirpur U Mandal, Komarambheem Dist (district) Mandal in telugu, Komuram bheem kumram bheem Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి