బుగ్గారం జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లాలో ఉత్తరాన గోదావరి నది సరిహద్దులో ఉంది. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 11 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా అవతరించింది. అంతకుక్రితం ధర్మపురి మండలంలో ఉన్న 8 గ్రామాలు, గొల్లపల్లి మండలంలోని 3 గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన ధర్మపురి మండలం, తూర్పున వెల్గటూరు మండలం, దక్షిణాన గొల్లపల్లి మండలం, పశ్చిమాన జగిత్యాల గ్రామీణ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి ఈ మండలం మీదుగా పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2019లో మండల అధ్యక్షులుగా రాజమని, జడ్పీటీసిగా తెరాసకు చెందిన రాజేందర్ రెడ్డి ఎన్నికైనారు. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలుండగా అన్నింటినీ తెరాస గెలుచుకుంది. జనాభా:
2001 ప్రకారం మండల జనాభా 73230. ఇందులో పురుషులు 36124, మహిళలు 37106. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 76416. ఇందులో పురుషులు 37810, మహిళలు 38606.
బుగ్గారం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Beersani, Buggaram, Chinnapur, Gangapur, Gopulapuram, Maddunur, Shakalla, Sirikonda, Sirivanchakota, Velgonda, Yashwantharaopet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Buggaram Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి