కథలాపూర్ జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 19 రెవెన్యూ గ్రామాలు కలవు. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణంవైపున నిజామాబాదు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల సరిహద్దులో ఉంది. మండల పరిధిలోని కలికోటలో సూరమ్మ రిజర్వాయరు నిర్మిస్తున్నారు.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన కోరుట్ల మండలం, తూర్పున మేడిపల్లి మండలం, వాయువ్యాన మెట్‌పల్లి మండలం, పశ్చిమాన నిజామాబాదు జిల్లా, దక్షిణాన రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: కోరుట్ల నుంచి వేములవాడ వెళ్ళూ రహదారి మండల కేంద్రం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2014లో కథలాపూర్ జడ్పీటీసిగా ఎన్నికైన తుల ఉమ కరీంనగర్ జడ్పీచైర్మెన్ పీఠాన్ని అధిరోహించింది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన నాగం భూమయ్య ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44135. ఇందులో పురుషులు 20971, మహిళలు 23164. స్త్రీపురుష నిష్పత్తి (1105/వెయ్యి పురుషులకు)
కథలాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ambaripet, Bhushanraopeta, Bommena, Chinthakunta, Dulur, Dumpeta, Gambhirpur, Ippapalle, Kalikota, Kathlapur, NagaMallappakunta, Ootapalle, Peggerla, Posanipeta, Potharam, Sirkonda, Thakkallapalle, Thandriyal, Thurthi
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కత్లాపూర్ (Kathlapur): కత్లాపూర్ జగిత్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. కోరుట్ల నుంచి వేములవాడ వెళ్ళూ రహదారి మండల కేంద్రం మీదుగా వెళ్ళుచున్నది.
కలికోట (Kalikota):
కలికోట జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలమునకు చెందిన గ్రామము. కలికోట చెరువు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని నాగారం చెరువులను కలుపుతూ రిజర్వాయర్‌గా మార్చేందుకు ప్రభుత్వం 2016, నవంబర్ 21న ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 1000 ద్వారా జారీ చేసింది. దీనికి సూరమ్మ రిజర్వాయరుగా పేరుపెట్టారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kathlapur Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి