కొడిమ్యాల్ జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. జిల్లాలో దక్షిణం వైపున రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో దక్షిణం వైపున రాజన్న సిరిసిల్ల మరియు కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి ఉత్తరాన మల్యాల మండలం, వాయువ్యాన మేడిపల్లి మండలం, తూర్పున మరియు ఆగ్నేయాన కరీంనగర్ జిల్లా, దక్షిణాన రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన పునుగోటి ప్రశాంతి ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 43600. ఇందులో పురుషులు 21250, మహిళలు 22350.
కొడిమ్యాల్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Cheppial, Gourapur, Kodimial, Konapur, Kondapur, Nachupalle, Nallagonda, Namilikonda, Potharam, Pudur, Ramsagar, Sanivarampeta, Surampeta, Thippaipalle, Thirmalapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kodimial or Kodimyal Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి