6, ఏప్రిల్ 2020, సోమవారం

పరవస్తు చిన్నయసూరి (Paravastu Chinnayasuri)

పరవస్తు చిన్నయసూరి
జననం1806
రంగంసాహితీవేత్త
ముఖ్య రచననీతిచంద్రిక,
మరణం1862
తెలుగు సాహిత్య గద్యరంగంలో పేరుపొందిన పరవస్తు చిన్నయసూరి 1806లో (కొన్ని గ్రంథాల ప్రకారం 1809లో) తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో (మద్రాసులో ?) వైష్ణవ కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాసాంబ ఈస్టిండియా కంపెనీ యొక్క సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. చిన్నయసూరి సంస్కృతాంధ్ర భాషలతో పాటు ప్రాకృత, ద్రవిడ భాధలలో ప్రావీణ్యం సాధించారు. పచ్చయప్ప కళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల అధ్యక్షుడు అర్బత్‌నట్ చిన్నయ పాండిత్యానికి మెచ్చి "సూరి" బిరుదాన్ని ఇచ్చాడు (సూరి అనగా అర్థం పండితుడు). నీతిచంద్రకతో పాటు పలు గ్రంథాలు రచించడమే కాకుండా స్వంతంగా వాణిదర్పణం ముద్రణశాలను నెలకొల్పారు మరియు సుజనరంజని మాసపత్రికను వెలువరించారు. "పద్యానికి నన్నయ వలె, గద్యానికి చిన్నయ"గా పేరుపొందిన చిన్నయసూరి 1862 (1861?)లో మరణించారు.

చిన్నయసూరి ముఖ్య రచనలు: నీతిచంద్రిక (విష్ణుశర్మ పంచతంత్రం ఆధారంగా), బాలవ్యాకరణం, శబ్దలక్షణ సంగ్రహము, ఆంధ్ర శబ్దాను శాసనం

ఇవి కూడా చూడండి:
  • నీతిచంద్రిక,  



హోం
విభాగాలు: తెలుగు సాహితీవేత్తలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక