కోరుట్ల జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. నూతనంగా వేస్తున్న పెద్దపల్లి-నిజామాబాదు రైల్వేమార్గం మండలం గుండా వెళ్ళుతుంది. బుగ్గారం మాజీ ఎమ్మెల్యే ఏనుగు నారాయణరెడ్డి, ప్రముఖ ఛాయాచిత్రకారుడు బండి రాజన్‌బాబు ఈ మండలమునకు చెందినవారు. జూలై 19, 2019న ఇది కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో మల్లాపూర్ మండలంలోని ఒక గ్రామాన్ని ఈ మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన మల్లాపూర్ మండలం, ఈశాన్యాన రాయికల్ మండలం, తూర్పున మరియు ఆగ్నేయాన మేడిపల్లి మండలం, దక్షిణాన కొత్లాపూర్ మండలం, పశ్చిమాన మెట్‌పల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం గుండా నిజామాబాదు-జగదల్‌పూర్ జాతీయ రహదారి వెళ్ళుచున్నది. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. మండలానికి రైలు సదుపాయము లేదు. రాజకీయాలు: ఈ మండలము కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 1962లో బుగ్గారం నుంచి ఎన్నికైన ఏనుగు నారాయణరెడ్డి ఈ మండలంనకు చెందినవారు. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన దరిశెట్టి లావణ్య ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 108123. ఇందులో పురుషులు 53596, మహిళలు 54527. పట్టణ జనాభా 66293, గ్రామీణ జనాభా 41830.
కోరుట్ల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ailapur, Chinna Metpalli, Dharmaram, Gumlapur, Joganpalli, Kallur, Korutla, Madhapur, Mohanraopet, Nagulapet, Paidimadugu, Sangem, Venkatapur, Yekinpur, Yusufnagar
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
జోగన్ పల్లి (Joganpalli): జోగన్ పల్లి జగిత్యాల జిల్లా కోరుట్ల మండలమునకు చెందిన గ్రామము. నిజాం విమోచనోద్యమకారుడు, బుగ్గారం మాజీ ఎమ్మెల్యే ఏనుగు నారాయణరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు. కోరుట్ల (Korutla): కోరుట్ల జగిత్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. 2019 జూలైలో రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. పెద్దపల్లి నుంచి నిజామాబాదు వరకు నిర్మాణంలో ఉన్న రైలుమార్గం కోరుట్ల గుండా వెళ్ళుతుంది. కోరుట్లలో రైల్వేస్టేషన్ కూడా నిర్మించబడుతుంది. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Korutla or Koratla Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి