12, ఏప్రిల్ 2020, ఆదివారం

మల్లాపూర్ మండలం (Mallapur Mandal)

మల్లాపూర్ మండలం
జిల్లా జగిత్యాల జిల్లా
రెవెన్యూ డివిజన్ మెట్‌పల్లి
అసెంబ్లీ నియోజకవర్గంకోరుట్ల
లోకసభ నియోజకవర్గంనిజామాబాదు
మల్లాపూర్ జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం జిల్లాలో ఉత్తరంవైపున నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ మండలము మెట్‌పల్లి రెవెన్యూ డివిజన్, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009 నుంచి కోరుట్ల నుంచి వరస విజయాలు సాధిస్తున్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు.

ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఈ మండలంలోని ఒక గ్రామాన్ని కోరుట్ల మండలంలో కలిపారు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున రాయికల్ మండలం, దక్షిణాన కోరుట్ల మండలం, పశ్చిమాన ఇబ్రహీంపట్నం మండలం, ఉత్తరాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది.

రవాణా సౌకర్యాలు:
నిర్మల్ నుంచి జగిత్యాల వరకు ఉన్న రెండు జాతీయరహదారులను కలిపే రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. నిజామాబాదు-జదగల్‌పూర్ జాతీయ రహదారి మండలానికి దక్షిణంగా మెట్‌పల్లి, కోరుట్ల మీదుగా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009, 2014, 2018లలో కోరుట్ల నుంచి విజయం సాధించిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ మండలమునకు చెందినవారు. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53860. ఇందులో పురుషులు 26094, మహిళలు 27766.


మల్లాపూర్ మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Adavimadhapur, Chittapur, Damarajapalli, Gorrepalli, Gundampalli, Indiranagar, Laxmipur, Mallapur, Mogalpet, Muthyampet, Nadukuda, Obulapur, Raghavapeta, Ramdaspeta, Regunta, Sangem, Sataram, Sirpur, Srirampur, Valgonda, Vempalli, Venkatraopet

ప్రముఖ గ్రామాలు / పట్టణాలు


ముత్యంపేట (Mutyampet):

ముత్యంపేట జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ పైవేటు రంగంలో చక్కెర కర్మాగారం ఉంది. (నిజాం దక్కన్ షుగర్స్ ఫాక్టరీ). 
రాఘవపేట (Raghavapet):
రాఘవపేట జగిత్యాల జిల్లా మల్లాపుర్ మండలమునకు చెందిన గ్రామము. 2009లో కోరుట్ల నుంచి విజయం సాధించిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఈ గ్రామమునకు చెందినవారు. 


ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: జగిత్యాల జిల్లా మండలాలు,  మల్లాపూర్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Karimnagar Dist, 2014,
  • Handbook of Census Statistics, Karimnagar District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 226 తేది: 11-10-2016 
  • కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • http://Jagitial.telangana.gov.in/ (Official Website of Jagityal Dist),


Mallapur Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక