మల్యాల జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 19 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా పెద్దపల్లి-నిజామాబాదు రైలుమార్గం వెళ్ళుచున్నది. ప్రసిద్ధిచెందిన ఆంజనేయస్వామి ఆలయం కొండగట్టులో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుజ్జీవన పథకంలో భాగంగా మల్యాల మండలం రాంపుర్‌లో పంప్ హౌస్ నిర్మిస్తున్నారు.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన జగిత్యాల మరియు జగిత్యాల గ్రామీణ మండలం, తూర్పున పెగడపల్లి మండలం, ఈశాన్యాన గొల్లపల్లి మండలం, దక్షిణాన కొడిమ్యాల మండలం, పశ్చిమాన మేడిపల్లి మండలం, ఆగ్నేయాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: కరీంనగర్ నుంచి జగిత్యాల వెళ్ళు ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన కొండపాకుల రాంమోహన్ రావు ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47298. ఇందులో పురుషులు 23030, మహిళలు 24268.
మల్యాల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Balwanthapur, Gorregundam, Maddutla, Mallial, Manala, Muthyampeta, Myadampalle, Nookapalle, Obulapur, Potharam, Rajaram, Rampur, Sarvapur, Thakkallapalle, Thatipalle
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొండగట్టు (Kondagattu): కొండగట్టు జగిత్యాల జిల్లా మల్యాల మండలమునకు చెందిన గ్రామము. కొండగట్టులో (ముత్యంపేట గ్రామం) ప్రఖ్యాతిగాంచిన శ్రీఆంజనేయస్వామి ఆలయం ఉంది. వైశాఖ బహుళ దశమి రోజున (ఆంజనేయస్వామి జయంతి) ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుపుతారు. 2012 మార్చి 21న లారీ బోల్టా పడి 10 మంది మృతిచెందారు. మ్యాడంపల్లి (Myadampally): మ్యాడంపల్లి జగిత్యాల జిల్లా మల్యాల మండలమునకు చెందిన గ్రామము. సామాజికవేత్త, రాష్ట్రీయ స్వయంసేవక్ నాయకుడు ముదుగంటి మల్లారెడ్డి మ్యాడంపల్లి గ్రామానికి చెందినవారు. 8 సం.ల పాటు సంఘ్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. జూన్ 8, 2011న మల్యాలక్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Mallial or Malyal Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి