ధర్మపురి జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. ఇది జిల్లాలో ఉత్తరాన గోదావరి నది సరిహద్దులో ఉంది. మండల కేంద్రం ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు ఈ మండలమునకు చెందినవారు.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఈ మండలాన్ని రెండుగా విభజించి 11 రెవెన్యూ గ్రామాలతో కొత్తగా బుగ్గారం మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో ఈశాన్యాన మంచిర్యాల జిల్లా సరిహద్దులో గోదావరి తీరాన ఉంది. ఈ మండలానికి దక్షిణాన బుగ్గారం మండలం, పశ్చిమాన బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలు, నైరుతిన జగిత్యాల గ్రామీణ మండలం, ఉత్తరాన మరియు తూర్పున మంచిర్యాల జిల్లా సరిహద్దుగా ఉంది. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి ఈ మండలం మీదుగా పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు ఈ మండలమునకు చెందినవారు. జనాభా:
2001 ప్రకారం మండల జనాభా 73230. ఇందులో పురుషులు 36124, మహిళలు 37106. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 76416. ఇందులో పురుషులు 37810, మహిళలు 38606.
ధర్మపురి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Arepalli, Dharmapuri, Donthapur, Donur, Jaina, Kamalapur, Nagaram, Nerella, Rajaram, Rayapatnam, Theegaladharmaram, Thimmapur, Thummenala
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ధర్మపురి (Dharmapuri): ధర్మపురి జగిత్యాల జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ధర్మపురిలో ప్రాచీనమైన శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయం ఉంది. 1425లో ప్రాచీన నరసింహాలయం ధ్వసం కాగా 1724-50 మధ్య ధర్మపురి వాసులు తిరిగి ఆలయాన్నినిర్మించారు. ఈ ఆలయం ప్రక్కనే రామలింగేశ్వరస్వామి గుడి ఉంది. దీనితో శైవ-వైష్ణవ ఆలయాలుగా ప్రసిద్ధి చెందింది. ధర్మపురి ఒకప్పుడు బ్రాహ్మణ అగ్రహారం. నరసింహ శతకం రాసిన కవి ఈ గ్రామానికి చెందినవారు. ఒకప్పుడు ఇచ్చట వేదపండితులు అధికంగా ఉండేవారు. తిమ్మాపూర్ (Thimmapur): తిమ్మాపూర్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలమునకు చెందిన గ్రామము. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన జువ్వాడి రత్నాకర్ రావు ఈ గ్రామమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dharmapuri Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి