జగిత్యాల గ్రామీణ జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పాటైన ఈ మండలంలో 16 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు. నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు 16వ నెంబరు జాతీయరహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండలంలోని పొలాస (పూర్వనామం పొలవాస) ఒక చారిత్రకమైన గ్రామం. మేడరాజులు దీన్ని రాజధానిగా చేసుకొని 200 ఏళ్ళు పాలించారు. జడ్పీ చైర్మెన్ గా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన్ సుద్దాల దేవయ్య, ఎంపీగా, ఈ మండలమునకు చెందినవారు.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో జగిత్యాల మండలాన్ని రెండుగా విభజించి 20 గ్రామాలతో కొత్తగా జగిత్యాల గ్రామీణ మండలాన్ని ఏర్పాటుచేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన రాయికల్ మండలం, సారంగాపూర్ మండలం, తూర్పున బుగ్గారం మండలం మరియు గొల్లపల్లి మండలం, దక్షిణాన జగిత్యాల మరియు మల్యాల మండలాలు, పశ్చిమాన మేడిపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండల కేంద్రం గుండా వెళ్ళుచున్నది. ఇది కాకుండా జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళుటకు ప్రధాన రహదారి కూడా ఉంది. రాజకీయాలు: ఈ మండలము జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. జడ్పీ చైర్మెన్ గా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన్ సుద్దాల దేవయ్య, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఎల్.రమణ ఈ మండలమునకు చెందినవారు. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన దేవ వసంత ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 168951. ఇందులో పురుషులు 83817, మహిళలు 85134. పట్టణ జనాభా 103962, గ్రామీణ జనాభా 64989.
జగిత్యాల గ్రామీణ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Anantharam, Anthargaon, Chelgal, Dharmaram, Gullapeta, Habsipur, Jabithapur, Kalleda, Kandlapalli, Kannapur, Laxmipuram, Morapalli, Narsingapur, Polasa, Porandla, Somanpalli, Takkallapalli, Thatipalli, Thimmapur, Veldurti
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అంతర్గాం (Antargaon): అంతర్గాం జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలమునకు చెందిన గ్రామము. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన సుద్దాల దేవయ్య ఈ గ్రామానికి చెందినవారు. చల్‌గల్ (Chalgal): చల్‌గల్ జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలమునకు చెందిన గ్రామము. ఇది జాతీయ రహదారిని ఆనుకొని ఉంది. ఇక్కడ రైతు రైతుశిక్షణ కేంద్రం, ప్రదర్శన క్షేత్రం ఏర్పాటుచేశారు. పొలాస (Polasa): పొలాస జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలమునకు చెందిన గ్రామము. ఇది చారిత్రకమైన గ్రామము. దీన్ని రాజధానిగా చేసుకొని మేడరాజులు సుమారు 200 సం.లు పరిపాలించారు. కాకతీయుల కాలం నాటి పౌలస్తేశ్వరాలయం గ్రామంలో ఉంది. పొలాస జగిత్యాలకు 9 కి.మీ. దూరంలో కలదు. ఇది ఒక చారిత్రాత్మక గ్రామం. ఈ ఊరిలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ క్షేత్రం మరియు వ్యవసాయ కళాశాల ఉన్నాయి.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Jagityal Jagitial Rural Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి