పెగడపల్లి జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 13 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన టి.జీవన్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. పల్నాటి యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన నాయకురాలు నాగమ్మ ఈ మండలంలోని ఆరవెల్లి గ్రామకోడలు.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. అదేసమయంలో ఈ మండలంలోని 2 రెవెన్యూ గ్రామాలను గొల్లపల్లి మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన గొల్లపల్లి మండలం, ఈశాన్యాన వెల్గటూరు మండలం, పశ్చిమాన మల్యాల మండలం, తూర్పున పెద్దపల్లి జిల్లా, దక్షిణాన కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: రాజకీయాలు: ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన కసుగంటి రాజేందర్ రావు ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47903. ఇందులో పురుషులు 23830, మహిళలు 24073.
పెగడపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Aithupalli, Aravelli, Bathkepalli, Divikonda, Keesulatapalli, Legalamarri, Lingapur, Namapur, Nancherla, Nandagiri, Narsimhunipeta, Pegadapalli, Vengalaipet, Yellapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బతికెపల్లి (Batikepalli): బతికెపల్లి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలమునకు చెందిన గ్రామము. రాష్ట్ర మంత్రిగా పనిచేసిన టి.జీవన్ రెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Pegadapalli Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి