రాయికల్ జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. ఈ మండలం జిల్లాలో ఉత్తరం వైపున నిర్మల్ జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తర సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు కలవు.
ఈ మండలం అక్టోబరు 11, 2016కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున సారంగాపూర్ మండలం, ఈశాన్యాన బీర్పూర్ మండలం, దక్షిణాన మేడిపల్లి మండలం మరియు జగిత్యాల గ్రామీణ మండలం, నైరుతిన కోరుట్ల మండలం, పశ్చిమాన మల్లాపూర్, ఉత్తరాన నిర్మల్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: నిర్మల్ నుంచి జగిత్యాల వరకు వెళ్ళు రెండు జాతీయ రహఆరులను కలిపే రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. నిజామాబాదు-జగదల్ పూర్ జాతీయ రహదారి ఈ మండలానికి దక్షిణంగా కోరుట్ల, మేడిపల్లిల మీదుగా పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలము జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన జాదవ్ అశ్విని ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 63980. ఇందులో పురుషులు 31163, మహిళలు 32817.
రాయికల్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Allipur, Alur, Bhoopathipur, Bornapalle, Chintalur, Devanpalle, Dharmajipet, Itkyal, Katkapur, Kistampet, Kummaripalle, Mahitapur, Mootapalle, Oddelingapur, Raikal, Ramajipet, Tatlavai, Uppumadige, Vasthapur, Veerapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
రాయికల్ (Raikal): రాయికల్ జగిత్యాల జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామానికి చెందిన వేముల పెరుమాళ్ళు గ్రామాభివృద్ధి అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాలలో చేరి రాయికల్ తొలి మండల అధ్యక్షులైనారు. ఇతను తెలంగాణ జాతీయాలు పుస్తకాన్ని రచించారు. రాయికల్ లో శ్రీకేశవనాథ పంచముఖ లింగేశ్వర త్రికూట దేవాలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Raikal Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి