వెల్గటూరు జగిత్యాల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు. చారిత్రక అవశేషాలు లభించిన ప్రముఖ స్థలం కోటిలింగాల ఈ మండలంలోనే ఉంది. 2004లో చొప్పదండి నుంచి ఎన్నికైన సాన మారుతి, 2009లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గంగుల కమలాకర్ ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లాలోకి చేరింది. అదేసమయంలో ధర్మపురి మండలంలోని ఒక గ్రామాన్ని ఈ మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో తూర్పున మంచిర్యాల మరియు పెద్దపల్లి జిల్లాల సరిహద్దులో ఉంది. ఈ మండలానికి పశ్చిమాన గొల్లపల్లి మండలం, వాయువ్యాన బుగ్గారం మరియు ధర్మపురి మండలాలు, నైరుతిన పెగడపల్లి మండలం, ఉత్తరాన మంచిర్యాల జిల్లా, దక్షిణాన పెద్దపల్లి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: జగిత్యాల నుంచి పెద్దపల్లి వెళ్ళు రహదారి ఈ మండలం మీదుగా వెళ్ళుచున్నది. రాజకీయాలు: ఈ మండలము ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం, పెద్దపల్లి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2004లో చొప్పదండి నుంచి ఎన్నికైన సాన మారుతి, 2009లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గంగుల కమలాకర్ ఈ మండలమునకు చెందినవారు. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన బొడ్డు సుధారాణి ఎన్నికయ్యారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51727. ఇందులో పురుషులు 25789, మహిళలు 25938.
వెల్గటూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ambaripet, Chegyam, Endapalli, Godishelpet, Gullakota, Jagdevpet, Kapparaopet, Kishanraopet, Kondapur, Kothapet, Mukkatraopet, Muthunur, Padkal, Paidipalli, Pathagudur, Ramnur, Sakapuram, Sankenapalli, Shanabanda, Sthambhampalli, Suraram, Velgatur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గుళ్లకోట (Gillakora): గుళ్లకోట జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలమునకు చెందిన గ్రామము. 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సాన మారుతి ఈ గ్రామానికి చెందినవారు. కప్పారావుపేట (Kapparaopet): కప్పారావుపేట జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ 1976 లో శాతవాహినుల కాలంనాటి సిముఖ అనే పేరు గల నాణేలు లభించాయి. కోటిలింగాల (Kotilingala): కోటిలింగాల జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలమునకు చెందిన గ్రామము. ఇది శాతవాహనుల తొలి రాజధాని. ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు లభించాయి. ముక్కట్రావుపేట (Mukkatravupet): ముక్కట్రావుపేట జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలమునకు చెందిన గ్రామము. 2012 ఏప్రిల్ 29న గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రాచీన లిపితో కూడిన శిలాశాసనం బయటపడింది. అక్షరాలు బ్రాహ్మీలిపిలో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ గ్రామం ఎల్లంపల్లి ప్రాజెక్తు ముంపుగ్రామం. పైడిపల్లి (Paidipalli): పైడిపల్లి జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలమునకు చెందిన గ్రామము. 2009లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గంగుల కమలాకర్ స్వగ్రామం.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Velgatur Mandal, jagityal Dist (district) Mandal in telugu, JagityalaDist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి