బోయిన్‌పల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 23 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. మార్చి 2018లో రాజ్యసభకు ఎన్నికైన జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ మండలానికి చెందినవారు. మండలంలోని మాన్వాడ వద్ద మిడ్ మానేరు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మండలం దక్షిణ సరిహద్దు గుండా మానేరు నది ప్రవహిస్తోంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలం జిల్లాలో తూర్పువైపున కరీంనగర్ జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి దక్షిణాన ఇల్లంతకుంట మండలం, పశ్చిమాన వేములవాడ మండలం, వాయువ్యాన వేములవాడ గ్రామీణ మండలం, ఉత్తరాన జగిత్యాల జిల్లా, తూర్పున కరీంనగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: కామారెడ్డి నుంచి కరీంనగర్ వెళ్ళు ప్రధానమార్గం మండలం గుండా పోవుచున్నది. రాజకీయాలు: ఈ మండలము చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన కె.ఉమ ఎన్నికైనారు. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 39037. ఇందులో పురుషులు 19461, మహిళలు 19576.
బోయిన్‌పల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Ananthapalle, Boinpalle, Burgupalle, Dundrapalle, Kodurupaka, Korem, Kothapeta, Malkapur, Mallapur, Manwada, Narsingapur, Shabashpalle, Sthambhampalle, Thadagonda, Vardavelli, Vilasagar
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
కొదురుపాల (Kodurupaka): కొదురుపాక రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలానికి చెందిన గ్రామము. మార్చి 2018లో ఈ గ్రామానికి చెందిన జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యారు
మాన్వాడ (Manwada):
మాన్వాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు బోయిన్‌పల్లి మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ 25.8 టీఎంసీల సామర్థ్యంతో మిడ్ మానేరు ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Boinpalli Mandal, Rajanna Sirisilla Dist (district) Mandals in telugu, Rajanna Sirisilla Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి