కొడకండ్ల జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. ఏడునూతల గ్రామం వద్ద కొడకండ్ల ప్రాజెక్టు నిర్మించారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. అక్టోబరు 31, 2020న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే మండలకేంద్రం కొడకండ్లలో రాష్ట్రంలోనే తొలి రైతువేదిక ప్రారంభోత్సవం జరిగింది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన పాలకుర్తి మండలం, పశ్చిమాన దేవరుప్పుల మండలం, తూర్పున మహబూబాబాదు జిల్లా, దక్షిణాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51944. ఇందులో పురుషులు 25961, మహిళలు 25983. రాజకీయాలు: ఈ మండలము పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ధరావత్ జ్యోతి, జడ్పీటీసిగా తెరాసకు చెందిన కేలోతు సత్తెమ్మ ఎన్నికయ్యారు.. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Edunuthala, Kodakandla, Lakshmakkapalli, Mondrai, Narsingapur, Pakala, Ramavaram, Rangapur, Regula
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
ఏడునూతల (Edunuthala):
ఏడునూతల జనగామ జిల్లా కొడకండ్ల మండలమునకు చెందిన గ్రామము. గ్రామపరిషిలో కొడకండ్ల ప్రాజెక్టు నిర్మించబడింది. గ్రామంలో జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాల ఉంది. 2019 జూలైలో మంత్రి వి.శ్రీనివాస్ అగౌడ్‌చే సర్వాయిపాపన్న విగ్రహం ఆవిష్కరించబడింది. కొడకండ్ల (Kodakandla):
కొడకండ్ల జనగామ జిల్లాకు చెందిన రెవెన్యూ గ్రామము మరియు మండల కేంద్రము. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అక్టోబరు 31, 2016న ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలో చేరింది. అక్టోబరు 31న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుచే మండలకేంద్రం కొడకండ్లలో రాష్ట్రంలోనే తొలి రైతువేదిక ప్రారంభోత్సవం జరిగింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kodakandla Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి