లింగాల ఘన్‌పూర్ జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 21 గ్రామపంచాయతీలు, 14 రెవెన్యూ గ్రామాలు కలవు. విమోచనోద్యమకారుడు, కవిగా పేరుపొందిన గంగుల శాయిరెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన జనగామ మండలం మరియు రఘునాథపల్లి మండలం, తూర్పున మరియు ఆగ్నేయాన దేవరుప్పుల మండలం, దక్షిణాన & పశ్చిమాన యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. రవాణా సౌకర్యాలు: జనగామ నుంచి సూర్యాపేట వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్తుంది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 38268. ఇందులో పురుషులు 19118, మహిళలు 19150. రాజకీయాలు: ఈ మండలము స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన చిట్ట జయశ్రీ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన గుడి వంశీధర్ రెడ్డి ఎన్నికయ్యారు.
లింగాల ఘన్‌పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Cheeturu, Chinnarajpet, Gummadavelli, Jeedikal, Kallem, Kothapalli, Kundaram, Lingalaghanpur, Nagaram, Nellutla, Nyalapogula, Siripuram, Vanaparthy, Waddicherla
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
జీడికల్ (Jeedikal):
జీడికల్ జనగామ జిల్లా లింగాల ఘన్‌పూర్ మండలమునకు చెందిన గ్రామము. విమోచనోద్యమకారుడు, కవిగా పేరుపొందిన గంగుల శాయిరెడ్డి ఈ మండలమునకు చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Lingala ghanpur Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి