21, అక్టోబర్ 2014, మంగళవారం

హర్యానా (Haryana)

హర్యానా
రాజధానిచండీఘర్
వైశాల్యము44,212 చకిమీ
జనాభా2,53, 53,081 (2011)
జిల్లాలు21
హర్యానా భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఒకటి. ఇది ఉత్తర భారతదేశంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలను సరిహద్దులుగా కలిగియుంది. పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన ఈ రాష్ట్రంలోని ప్రముఖ పట్టణాలు ఢిల్లీ పరిసరాలలో ఉండటమే కాకుండా నేషనల్ కేపిటల్ రీజియన్‌లో భాగంగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 21 జిల్లాలు, 90 శాసనసభ స్థానాలు, 10 లోకసభ స్థానాలు, 5 రాజ్యసభ స్థానాలు కలవు. రాష్ట్ర వైశాల్యము 44,212 చకిమీ మరియు 2011 లెక్కల ప్రకారం జనాభా 2,53,53,081. కేంద్రపాలిత ప్రాంతమైన చండీఘర్ ఈ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతోంది.

భౌగోళికం, సరిహద్దులు:
హర్యానా రాష్ట్రం 27°39' నుంచి 30°35' ఉత్తర అక్షాంశం మరియు 74°28' నుంచి 77°36' తూర్పు రేఖాశం వరకు విస్తరించియుంది. ఈ రాష్ట్రానికి తూర్పున ఉత్తరప్రదేశ్, దక్షిణాన మరియు పశ్చిమాన రాజస్థాన్, ఉత్తరాన పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సరిహద్దులుగా ఉండగా తూర్పు వైపున డిల్లీని 3 వైపులా ఈ రాష్ట్రం ఆవరించి ఉంది. రాష్ట్ర వైశాల్యం 44,212 చదరపు కిమీమీటర్లు.

చరిత్ర:
షోడస మహాజనపదాల కాలంలో ఈ ప్రాంతం కురు రాజ్యంలో భాగంగా ఉండేది. మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఈ రాష్ట్రంలో ఉంది. సింధూ నాగరికతకు చెందిన బన్వాలితో పాటు పలు పట్టణాలు ఈ రాష్ట్రంలో బయటపడ్డాయి. అంతరించిపోయిన సరస్వతి నది ఈ రాష్ట్రం గుండా ప్రవహించినట్లు, ఈ నదీతీరాన నాగరికత విలసిల్లినట్లు చరిత్రకారులు నిర్థారించారు. క్రీ.శ.7వ శతాబ్దిలో హర్షవర్థనుడు రాజధానిగా చేసుకున్న స్థానేశ్వర్ ఈ రాష్ట్రంలోనిదే. మధ్యయుగంలో ప్రముఖ యుద్ధాలు జరిగిన పానిపట్ ప్రాంతం హర్యానాలోనే ఉంది. 1556లో ఈ రాష్ట్రానికి చెందిన హేము ఢిల్లీ పీఠాన్ని అధిష్టించాడు. 1857 తిరుగుబాటు సమయంలో పలుయోధులు బ్రిటీష్ వారిని ఎదిరించారు. స్వాతంత్ర్యానంతరం పంజాబ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 1966 నవంబరు 1న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

సుష్మాస్వరాజ్
రాజకీయాలు:
ప్రారంభం నుంచి రాష్ట్ర రాజకీయాలు ఒక ప్రత్యేకతను చూపుతున్నాయి. 1967లోనే కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 1977లో జనతాపార్టీ, 1987లో జనతాదళ్, 1991లో సమాజ్‌వాదీ జనతాపార్టీ, 1996లో హర్యానా వికాస్ పార్టీ, 1999లో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, 2014లో భాజపాలు అధికారంలోకి వచ్చాయి. దేశ రాజకీయాలలో హర్యానా రాజకీయాలు ఆయారాం హయారాంగా పేరుపొందాయి. 1989-91 స్వల్పకాలంలో ఏకంగా 6 ముఖ్యమంత్రులు మారారు. భారతీయ జనతాపార్టీకి చెందిన ప్రముఖ నాయకురాల్య్ సుష్మాస్వరాజ్ ఈ రాష్ట్రానికి చెందినవారు.

కపిల్ దేవ్
క్రీడలు: 
అంతర్జాతీయ స్థాయి క్రీడలలో హర్యానా ఆటగాళ్ళు మంచి పేరుతెచ్చుకున్నారు. ఒలింపిక్ మరియు కామన్వెల్త్ క్రీడలలో కూడా పతకాలు సాధించారు. ముఖ్యంగా రెజ్లింగ్, వాలీబాల్, కబడ్డి పోటీలలో హర్యానా పేరుపొందింది. 2010లో ఢిల్లీ జరిగిన కామన్వెల్త్ క్రీడలలో భారత్ 38 స్వర్ణపతకాలు సాధించగా అందులో 22 పతకాలు హర్యానా క్రీడాకారులు సాధించినవే. రెజ్లింగ్ ఆటగాడు సుషీల్ కుమార్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ, 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించగా, మరో రెజ్లర్ యోగేశ్వర్ దత్ కూడా 2012 ఒలింపిక్స్‌లో పతకం అందించాడు. 1980,90 దశకంలో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, హర్యానా హరికేన్‌గా పేరుగాంచిన ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ ఈ రాష్ట్రానికి చెందినవాడు.

ఇవి కూడా చూడండి:

 హోం,
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, హర్యానా, 


 = = = = =


1 కామెంట్‌:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక