తరిగొప్పుల జనగామ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలంలో బొమ్మకూర్ జలాశయం ఉంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అంతకు క్రితం నర్మెట్ట మండలంలో ఉన్న 8 రెవెన్యూ గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటు చేశారు. అదేసమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లా ఉత్తరాన ఉంది. ఈ మండలానికి తూర్పున చిల్పూర్ మండలం, దక్షిణాన నర్మెట్ట మండలం, ఉత్తరాన వరంగల్ గ్రామీణ జిల్లా, పశ్చిమాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 42363. ఇందులో పురుషులు 21064, మహిళలు 21299. రాజకీయాలు: ఈ మండలము జనగామ అసెంబ్లీ నియోజకవర్గం, భువనగిరి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019లో జడ్పీటీసిగా తెరాసకు చెందిన తెరాసకు చెందిన ముద్దసాని పద్మజ ఎన్నికయ్యారు.
తరిగొప్పుల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Abdulnagaram, Akkerajepalli, Ankushapuram, Bonthagattunagaram, Narsapur, Potharam, Solipuram, Tharigoppula
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అబ్దుల్‌నాగారం (Abdulnagaram): అబ్దుల్‌నాగారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన గద్దెల పద్మ 2014లో నర్మెట్ట జడ్పీటీసిగా గెల్చి వరంగల్ జిల్లా పరిషత్తు చైర్మెన్‌గా ఎన్నికైనారు. 2001-06 కాలంలో ఈమె అబ్దుల్ నాగారం ఎంపీటీసిగా పనిచేశారు. స్వగ్రామం రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tarigoppula Mandal in Telugu, Jangoan Dist (district) Mandals in telugu, Janagoan Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి