21, జూన్ 2020, ఆదివారం

లింగమనేని (Lingamaneni)

లింగమనేని
రాజధాని
దేవరకొండ
పాలనకాలం
క్రీ.శ.15 శతాబ్ది
లింగమనాయుడు, లింగభూపతి అని కూడా పిల్వబడే లింగమనేడు దేవరకొండ పాలకుడు. రెండో మాదానేని చిన్న కుమారుడైన లింగమనాయుడు క్రీ.శ.15 శతాబ్దిలో దేవరకొండను పాలించిన ప్రముఖ పాలకుడిగా పేరుపొందాడు. దేచరకొండ రాజ్య చివరి దశలో ఈయనే ప్రముఖ పాలకుడు. తన పాలన కాలంలో లింగమనేడు ఏకధాటిగా 32 దుర్గాలను జయించిన వీరుడిగా పేరుపొందాడు. శ్రీనాథుడు రాచకొండను సందర్శించిన పిదప లింగమనేడు కాలంలో దేవరకొండను కూడా దర్శించి అల్లమ వేమారెడ్డిని జయించిన వీరునిగా లింగమనేడును స్తుతిస్తూ పద్యం రాశాడు. దీన్నిబట్టి క్రీ.శ.15వ శతాబ్ది ప్రారంభంలోనే లింగమనేడు అల్లియ వేమారెడ్డిని ఓడించి రాజమహేంద్రవరాన్ని జయించినట్లుగా తెలుస్తుంది.

లింగమనేడు కపిలేశ్వర హజపతితో కలిసి దక్షిణాంధ్ర భూభాగాలకు జయించాడు. శ్రీశైలం, కర్నూలు, నెల్లూరు, చివరికి కంచి వరకు లింగమనేడు జయించాడు. అప్పుడు ఈయన వెంబడిరాచకొండ సర్వజ్ఞ సింగభూపాలుడు కూడా ఉన్నాడు. లింగమనేడు తర్వాత సూరానేడు, పర్వతరావు, కుమార లింగమనేడు దేవరకొండ నామమాత్ర పాలకులైనారు.

ఇవి కూడా చూడండి:
  • దేవరకొండ దుర్గం,
  • దేవరకొండ పద్మనాయక రాజ్యం,


హోం
విభాగాలు: తెలంగాణ పాలకులు, దేవరకొండ రాజ్యం, క్రీ.శ.15వ శతాబ్ది,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక