నాగాలాండ్ భారతదేశ ఈశాన్యరాష్ట్రాలలో ఒకటి. మయన్మార్ సరిహద్దులో ఉన్న నాగాలాండ్ రాజధాని కోహిమా కాగా పెద్ద పట్టణం దిమాపూర్. 1963లో నాగాలాండ్ 16వ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో నాగా పర్వతాలు వ్యాపించియున్నాయి. నాగాలాండ్6లో 12 జిల్లాలు, 60 శాసనసభ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం, ఒక రాజ్యసభ స్థానం ఉన్నాయి. రాష్ట్ర అధికార భాష ఇంగ్లీష్. అత్యధిక మతస్థులు క్రైస్తవులు (88%), హిందువులు (9%) రెండోస్థానంలో ఉన్నారు. ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం. దిమాపూర్‌లో విమానాశ్రయం ఉంది. బ్రిటీష్ వారిపై పోరాడిన రాణి గైడిన్లు, రచయిత హరిప్రసాద్ గోర్ఖా రాయ్ నాగాలాండ్‌కు చెందినవారు.
భౌగోళికం: పర్వతమయమైన నాగాలాండ్ రాష్ట్రం భారతదేశ ఈశాన్యరాష్ట్రాలలో తూర్పువైపున మయన్మార్ (బర్మా) దేశ సరిహద్దులో ఉంది. ఉత్తరాన అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన అస్సాం, దక్షిణాన మణిపూర్, తూర్పున మయన్మార్ సరిహద్దులుగా ఉన్నాయి. 12 జిల్లాలు కల్గిన నాగాలాండ్ రాష్ట్రం 16,579 చకిమీ వైశాల్యంతో దేశంలో 25వ స్థానంలో, 19.80 లక్షల జనాభాతో 25వ స్థానంలో ఉంది. వైశాల్యంలోనూ మరియు జనాభాలోనూ భారతదేశంలోని చిన్న రాష్ట్రాలలో నాగాలాండ్ ఒకటి. చరిత్ర: రెండోప్రపంచయుద్ధం కాలంలో ఇప్పటి నాగాలాండ్ ప్రాంతంలో భీకరపోరాటం జరిగింది. స్వాతంత్ర్యానంతరం అస్సాం ప్రావిన్సులో భాగంగా కొనసాగింది. నాగాహిల్స్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే ఉద్యమం కొనసాగింది. 1957 ఒప్పందం అనుసారం నాగాలాండ్ కేంద్రపాలితప్రాంతంగా, 1963లో 16వ రాష్ట్రంగా అవతరించింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
|
21, జూన్ 2020, ఆదివారం
నాగాలాండ్ (Nagaland)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి