క్రీ.శ.14-15 శతాబ్దికి చెందిన ప్రముఖ తెలుగు కవిగా పేరుపొందిన శ్రీనాథుడు ప్రబంధశైలిలో రచనలు చేయుటలో సిద్ధహస్తుడు. జన్మించిన సంవత్సరం మరియు ప్రాంతం గురించి ఖచ్చితమైన సమాచారం లేకున్ననూ క్రీ.శ.1365-70 మధ్యలో కోస్తాంధ్రలోని కాలపటంలో జన్మించినట్లుగా ఆయన రచనల ద్వారా కొందరు చరిత్రకారులు, సాహితీవేత్తలు నిర్థారించారు. కవిసార్వభౌముడిగా పేరుపొందిన శ్రీనాథుడు 14 సం.ల వయస్సులోనే మరుత్తరాట్రరిత్ర రాసి తన బాల్యమిత్రుడు ఆవచి తిప్పయశెట్టికి వినిపించాడు. సుమారు 22 సం.లపాటు కొండవీటిని పాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానకవిగా శ్రీనాథుడు పనిచేశాడు. కొండవీటి రెడ్డి రాజుల కులదైవం "కఠారి"ని దేవరకొండ పాలకుడు లింగమనేడు నుంచి తన పాండిత్యంతో చేజిక్కించుకున్నాడు. వాగ్యుద్ధంలో గౌడ డిండిమభట్టును ఓడించి అతని కంచుఢక్కాను పగలగొట్టి విజయనగర రాజ్యంలో కనకాభిషేకం చేయించుకున్నాడు. సర్వజ్ఞ సింగభూపాలుని కాలంలో శ్రీనాథుడు రాచకొండను సందర్శించాడు. తన పాండిత్యంతో రాజస్థానంలో ఎంతో కీర్తిగడించిన శ్రీనాథుడు చివరిదశలో మాత్రం శోకంతో గడిపినట్లుగా ఆయన రచనలే తెల్పుతున్నాయి. క్రీ.శ.1441లో కృష్ణాతీరంలోని బొడ్డేపల్లిలో శ్రీనాథుడు మరణించినట్లుగా తెలుస్తుంది.
శ్రీనాథుని రచనలు: పండితారాధ్యచరిత్ర, హరవిలాసం, భీమఖండం, కాశీఖండం, శివరాత్రి మహత్యం, శృంగారనైషేధం, పల్నాటి వీరచరిత్ర, మరుత్తరాట్రరిత్ర, శృంగారదీపిక. గాథాసప్తశతిని ప్రాకృతం నుంచి తెలుగులోకి అనువదించాడు. క్రీడాభిరామం రచన విషయంలో సందిగ్దత ఉంది. కొందరు శ్రీనాథుడు రచించాడనీ మరికొందరు వినుకొండ వల్లభరాయలు రచించాడనీ భిన్నాభిప్రాయాలున్నాయి. బయోపిక్: 1993లో బాపు (సత్తిరాజు లక్ష్మీనారాయణ) దర్శకత్వంలో శ్రీనాథుని బయోపిక్ "శ్రీనాథ కవిసార్వభౌముడు" విడుదలైంది. ఈ సినిమాలో శ్రీనాథునిగా ఎన్టీఆర్, పెదకోమటి వేమారెడ్డిగా మిక్కులినేని నటించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
19, జూన్ 2020, శుక్రవారం
శ్రీనాథుడు (Srinatha)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి