ఆత్మకూరు వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌గా పనిచేసిన ప్రముఖ తెలంగాణ వాది కొత్తపల్లి జయశంకర్ ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 9 ఎంపీటీసి స్థానాలు, 16 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. మండలం గుండా జాతీయ రహదారి నెం. 202 వెళ్ళుచున్నది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన శాయంపేట మండలం, పశ్చిమాన నడికూడ మండలం, తూర్పున నల్లబెల్లి మండలం, దక్షిణాన గీసుకొండ మండలం, ఆగ్నేయాన దుగ్గొండి మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59584. ఇందులో పురుషులు 30089, మహిళలు 29495.
రాజకీయాలు:
ఈ మండలము పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2008లో పునర్విభజనకు ముందు శాయంపేట నియోజకవర్గంలో ఉండేది. 2019లో ఆత్మకూరు జడ్పీటీసిగా తెరాసకు చెందిన కెక్కెర్ల రాధిక ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Agrampahad, Atmakur, Brahamanapalli, Choudla Palli, House Buzurg, Kamaram, Katakshapur, kothagattu, Malakpet, Neerukulla, Peddapur, Penchikalpet
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అక్కంపేట (Akkampet): అక్కంపేట వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలమునకు చెందిన గ్రామము. కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా పనిచేసిన, తెరాస సిద్ధాంతకర్త, తెలంగాణకై 5 దశాబ్దాలుగా పోరాటం చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Athmakur Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి