వర్థన్నపేట వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 18 గ్రామపంచాయతీలు, 12 రెవెన్యూ గ్రామాలు కలవు. ఎస్సారెస్పీ ప్రధాన కాలువ మండలం గుండా వెళుతుంది. అయినవోలులో కాకతీయుల కాలం నాటి శ్రీమల్లికార్జునస్వామి ఆలయం ఉంది. ఇల్లందలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి తూర్పున పర్వతగిరి మండలం, దక్షిణాన రాయపర్తి మండలం, ఈశాన్యాన సంగెం మండలం, పశ్చిమాన జనగామ జిల్లా, ఉత్తరాన వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 72365. ఇందులో పురుషులు 36579, మహిళలు 35786. గృహాల సంఖ్య 16895. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 76710. ఇందులో పురుషులు 38506, మహిళలు 38204.
రాజకీయాలు:
ఈ మండలము వర్థన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఈ మండలానికి చెందిన కొండేటి శ్రీధర్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున వర్థన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన అన్నమనేని అప్పారావు, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన మర్గం భిక్షపతి ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bondauthapur, Chennaram, Dhammanapet, Divitipalli, Katrial, Kothapalli, Liabarthy, Nallabelli, Ramavaram, Upparapalli, Wardhannapet, Yellanda
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
అయినవోలు (Ayinavolu): అయినవోలు వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట మండలమునకు చెందిన గ్రామము. ఇది వరంగల్ నుంచి 12 కిమీ దూరంలో ఉంది. ఇక్కడ కాకతీయుల కాలం నాటి శ్రీమల్లికార్జునస్వామి ఆలయం ఉంది. పున్నేలు (Punnelu): పున్నేలు వరంగల్ గ్రామీణ జిల్లా వర్థన్నపేట మండలానికి చెందిన గ్రామం. జిల్లా కేంద్రానికి 15 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. పున్నేలులో రామాలయం, ఆంజనేయుని గుడి ఉన్నాయి. గ్రామంలో ఒక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉంది. వర్థన్నపేట (Warthannapet): వర్థన్నపేట వరంగల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఈ గ్రామానికి చెందిన కొండేటి శ్రీధర్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున వర్థన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఇల్లంద ():
ఇల్లంద వరంగల్ జిల్లా వర్థన్నపేట మండలమునకు చెందిన గ్రామము. గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Varthannapet Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి