శాయంపేట వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలో చలివాగు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి దక్షిణాన ఆత్మకూరు మండలం, పశ్చిమాన నడికూడ మండలం, వాయువ్యాన పరకాల మండలం, ఉత్తరాన మరియు తూర్పున జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 40348. ఇందులో పురుషులు 20133, మహిళలు 20215.
రాజకీయాలు:
ఈ మండలము భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన చల్లా ధర్మారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన మెతుకు తిరుపతిరెడ్డి, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన గండ్ర జ్యోతి ఎన్నికయ్యారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Gatlakaniparthy, , Hussainpalli, Katrapalli, Koppula, Mylaram, Neredpalli, Pattipaka, Pedda Kodepaka, Shayampet, Singaram (Dongala), Singaram (Kothagutta), Taharapur, Vasanthapur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
జోగంపల్లి (Jogampally): జోగంపల్లి వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామశివారులో చలివాగు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sangam Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి