సంగెం వరంగల్ గ్రామీణ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 33 గ్రామపంచాయతీలు, 17 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజారావు, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నర్సింహారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. కాజీపేట నుంచి విజయవాడ వెళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో వరంగల్ గ్రామీణ జిల్లాలో భాగంగా మారింది.
భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన గీసుకొండ మండలం, ఈశాన్యాన దుగ్గొండి మండలం, తూర్పున చెన్నారావుపేట మండలం, ఆగ్నేయాన నెక్కొండ మండలం, దక్షిణాన పర్వతగిరి మండలం, నైరుతిన వర్థన్నపేట మండలం, పశ్చిమాన వరంగల్ పట్టణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 53057. ఇందులో పురుషులు 26670, మహిళలు 26387.
రాజకీయాలు:
ఈ మండలము పరకాల అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2008లో పునర్విభజనకు ముందు వర్థన్నపేట నియోజకవర్గంలో ఉండేది. 2019లో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన కందగట్ల కళావతి, జడ్పీటీసి ఎన్నికలలో తెరాసకు చెందిన గూడ సుదర్శన్ ఎన్నికయ్యారు. 2019లో వరంగల్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన పసునూరి దయాకర్ ఈ మండలానికి చెందినవారు. మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Chintalapalli, Elugur ( Rangampet), Gavicherla, Kapulakanaparthy, Katrepale(Haveli), Lohitha, Mondrai, Mummadivaram, Nallabelli, Narlavai, Pallaruguda, Ramachandrapur, Sangem, Shapur, Theegarajupalli, Thimmapur, Venkatapur (Haveli)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
బొల్లికుంట (Bollikunta): బొల్లికుంట వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలమునకు చెందిన గ్రామము. ఇది ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజారావు స్వస్థలం. గవిచర్ల (Gavicherla): గవిచర్ల వరంగల్ జిల్లా సంగం మండలమునకు చెందిన గ్రామము. డిసెంబరు 2014లో పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ నర్సింహారెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.
పల్లారుగూడ (Pallaruguda):
పల్లారుగూడ వరంగల్ గ్రామీణ జిల్లా సంగం మండలమునకు చెందిన గ్రామము. జెన్‌కో ట్రాన్స్‌కో సీఎండీగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి సంగం ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sangam Mandal in Telugu, Warangal Rural Dist (district) Mandals in telugu, Warangal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి