దంతాలపల్లి మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 11 రెవెన్యూ గ్రామాలు కలవు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళూ రహదారి మండలం మీదుగా వెళ్తుంది.
అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. నర్సింహులుపేట మండలంలోని 10 గ్రామాలు మరియు నెల్లికుదూరు మండలంలోని ఒక గ్రామంతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. అదే సమయంలో ఈ మండలంలోని గ్రామాలు వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరామ నెల్లికుదూరు మండలం, తూర్పున నర్సింహులుపేట మండలం, నైరుతిన మరిపెడ మండలం, వాయువ్యాన తొర్రూరు మండలం, పశ్చిమాన మరియు దక్షిణాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58827. ఇందులో పురుషులు 29811, మహిళలు 29016. స్త్రీపురుష నిష్పత్తి 973/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలము డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ఒలాద్రి ఉమ, జడ్పీటీసిగా తెరాసకు చెందిన నూకల వెంకటేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు.
దంతాలపల్లి మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Agapet, Bodlada, Danthalapalli, Datla, Gunnepalli, Kalvapalli, Kummarikuntla, Peddamupparam, Ramavaram, Reponi, Vemulapalli
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
దంతాలపల్లి (Danthalapalli): దంతాలపల్లి మహబూబాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్విభజన సమయంలో ఈ గ్రామ కొత్తగా మండలకేంద్రంగా మారింది. అదే సమయంలో ఈ గ్రామం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన మహబూబాబాదు జిల్లాలోకి చేరింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Danthalapalli Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి