19, జులై 2020, ఆదివారం

డోర్నకల్ మండలం (Dornakal Mandal)

జిల్లా మహబూబాబాదు
రెవెన్యూ డివిజన్ మహబూబాబాదు
అసెంబ్లీ నియోజకవర్గండోర్నకల్
లోకసభ నియోజకవర్గంమహబూబాబాదు
డోర్నకల్ మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము.  మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. డోర్నకల్ మండల కేంద్రంలో కాకతీయుల కాలం నాటి మున్నేరు ఆనకట్ట ఉంది. కాజీపేట నుంచి విజయవాడ వెళ్ళు రైలుమార్గం మండలం మీదుగా వెళ్ళుచున్నది.

అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది.


భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన గార్ల మండలం, పశ్చిమాన కురవి మండలం, తూర్పున మరియు దక్షిణాన ఖమ్మం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 56407. ఇందులో పురుషులు 28328, మహిళలు 28079. మండలంలో పట్టణ జనాభా 14569, గ్రామీణ జనాభా 41838.

రాజకీయాలు:
ఈ మండలము డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన ధరంపోతు బాలు, జడ్పీటీసిగా తెరాసకు చెందిన పోడిశెటి కమల ఎన్నికయ్యారు.



డోర్నకల్ మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి

మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ammapalem, Burgupahad, Chilkodu, Dornakal, Gollacherla, Gurralakunta, Kannegundla, Mannegudem, Mulkalapalli, Perumandla -Sankes, Ravigudem, Uyyalawada, Vennaram


ప్రముఖ గ్రామాలు / పట్టణాలు

డొర్నకల్ (Dornakal):
డోర్నకల్ మహబూబాబాదు జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పురపాలక సంఘము మరియు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రము. డొర్నలక్ రైల్వే జంక్షన్‌గా కూడా ప్రసిద్ధి చెందింది. గ్రామంలో పురాతనమైన చర్చి ఉంది. ఇది 1939లో నిర్మించబడింది. గ్రామ పిన్ కోడ్ 506381.
గొల్లచర్ల (Gillacherla):
గొలచర్ల మహబూబాబాదు జిల్లా డోర్నకల్ మండలమునకు చెందిన గ్రామము. రచయిత దార్ల రామచంద్ర ఈ గ్రామానికి చెందినవారు.
పెరుమాండ్ల సంకీస (Perumandla -Sankes):
పెరుమాండ్ల సంకీస మహబూబాబాదు జిల్లా డోర్నకల్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడి సీతారామచంద్రస్వామి ఆలయంలో పురాతనమైన రాతిశాసనం ఉంది. దేవాలయ భూదాన తామ్రశాసనం కూడా లభ్యమైంది. ఉత్సవాలకు, కళ్యాణాలకు దేవుడికి కట్నం చెల్లించే పద్దతి ఉన్నట్లుగా ఈ శాసనాల ద్వారా తెలుస్తుంది.


ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: మహబూబాబాదు జిల్లా మండలాలు,  డోర్నకల్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Warangal Dist, 2016,
  • Handbook of Census Statistics, Warangal District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 235 తేది: 11-10-2016 
  • వరంగల్ జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • https://mahabubabad.telangana.gov.in/te/ (Official Website of Mahabubabad Urban Dist),


Dornakal Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక