నర్సింహులపేట మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 22 గ్రామపంచాయతీలు, 9 రెవెన్యూ గ్రామాలు కలవు. వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళు రహదారి మండలం మీదుగా వెళ్తుంది.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన నెల్లికుదూరు మండలం, తూర్పున చిన్నగూడూరు మండలం, దక్షిణాన మరిపెడ మండలం, పశ్చిమాన దంతాలపల్లి మండలం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 58827. ఇందులో పురుషులు 29811, మహిళలు 29016. స్త్రీపురుష నిష్పత్తి 973/ప్రతి వెయ్యి పురుషులకు.
రాజకీయాలు:
ఈ మండలము డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన టేకుల సుశీల, జడ్పీటీసిగా తెరాసకు చెందిన భూక్యా సంగీత ఎన్నికయ్యారు.
నర్సింహులపేట మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Akkirala, Bojjannapet, Jayapuram, Kausalyadevipalli, Kommulavancha, Mungimadugu, Narsimhulapet, Peddanagaram, Vanthadupula
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్సైట్లు:
|
Narsimhulupet Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి