తొర్రూరు మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 15 ఎంపీటీసి స్థానాలు, 29 గ్రామపంచాయతీలు, 22 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పాటైన మహబూబాబాదు జిల్లాలో చేరింది. అదేసమయంలో ఈ మండలంలోని 3 రెవెన్యూ గ్రామాలను కొత్తగా ఏర్పాటుచేసిన పెద్దవంగర మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున నెల్లికుదూరు మండలం, ఆగ్నేయాన దంతాలపల్లి మండలం, పశ్చిమాన పెద్దవంగర మండలం, ఉత్తారాన వరంగల్ గ్రామీణ జిల్లా, దక్షిణాన సూర్యాపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 76403. ఇందులో పురుషులు 38590, మహిళలు 37813. మండలంలో పట్టణ జనాభా 19214, గ్రామీణ జనాభా 57189.
రాజకీయాలు:
ఈ మండలము పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన తూర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసిగా తెరాసకు చెందిన మంగళపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
తొర్రూరు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Ammapur, Bonthupalli, Cherlapalem, Chikataipalem, Chinthalapalli, Fathepur, Gopalagiri, Gurthur, Haripriyal, Kantaipalem, Karkal, Khanapur, Kommanapalli, Madipalli, Matedu, Nancharimadur, Polepalli, Somaram, Thorrur (CT), Velikatte, Venkatapur, Zamisthanpur
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
..: ...
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Thorrur Mandal in Telugu, Mahabubabad Dist (district) Mandals in telugu, Mahabubabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి