12, ఆగస్టు 2020, బుధవారం

ఐజ్వాల్ (Aizawl)

ఐజ్వాల్
రాష్ట్రం
మిజోరం
జనాభా
2.93 లక్షలు
వైశాల్యం
457 చకిమీ
పిన్‌కోడ్
796001
ఐజ్వాల్ మిజోరం రాష్ట్రానికి చెందిన రాజధాని మరియు రాష్ట్రంలో పెద్ద పట్టణం. 2011 లెక్కల ప్రకారం పట్టణ జనాభా సుమారు 2.93 లక్షలు. రాష్ట్ర జనాభాలో 25% జనాభా ఈ ఒక్క నగరంలోనే ఉంది. జనాభాలో సుమారు 93% క్రైస్తవులు. మిజో తెగకు చెందిన వారు అధికసంఖ్యలో ఉన్నారు. పట్టణంలో అడ్వాన్స్‌డ్ రీసెర్చి సెంటర్ ఫర్ బాంబు అండ్ రాట్టన్ ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన లాల్‌తన్‌హావ్లా, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు జెర్మీ లాల్‌రినుంగా ఐజ్వాల్‌కు చెందినవారు. పట్టణానికి సమీపంలో లెంగ్‌పూ విమానాశ్రయం ఉంది.

భౌగోళికం:
ఐజ్వాల్ కర్కటరేఖకు పైన ఉంది. సుమారు 1100 మీ ఎత్తులో ఉన్నందున వాతావరణం చల్లదనం ఉంటుంది. వేసవిలో కూడా ఉష్ణోగ్రత 30° సెంటిగ్రేడ్ లోపు ఉంటుంది. పట్టణ తూర్పుదిశలో తూరియల్ నది ప్రవహిస్తోంది.
లెంగ్‌పూ విమానాశ్రయం

చరిత్ర:
1871-72 కాలంలో మిజోచీఫ్ పట్టుదలచే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ప్రత్యేక నివాసగృహాలను నిర్మించడంతో అదే తరువాత ఐజ్ వాల్ పట్టణం అయింది. 1966 మిజో నేషనల్ ఫ్రంట్ ఉద్యమం తలెత్తిన సమయంలో భారతీయ వాయుసేన ఈ ప్రాంతం మీద విమాన దాడులు చేసారు. తరువాత మిజో నేషనల్ ఫ్రంట్ తిరుగుబాటు తగ్గింది. మిజోరం రాష్ట్రంగా అవతరించిన పిదప ఇది రాజధానిగా మారింది.

క్రీడలు:
మిజోరాం క్రీడలలో ప్రధానమైనది ఫుట్‌బాల్. మిజోరాం రాష్ట్రానికి చెందిన పలువురు ఫుట్‌బాల్ క్రీడాకారులు జాతీయ జట్టులో స్థానం పొందారు. వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు జెర్మీ లాల్‌రినుంగా 2018 యూత్ ఒలింపిక్ క్రీడలలో స్వర్ణం సాధించాడు. లాల్‌రెంసియామి 2018 ప్రపంచకప్ హాకీ టోర్నమెంటులో ప్రాతినిధ్యం వహించాడు. బాక్సింగ్ క్రీడాకారిణి ఆర్.ఎల్.జెన్నీ ప్రపంచ చాంప్ మరియు ఆసియా చాంప్ బాల్సింగ్ పోటీలలో స్వర్ణాలు సాధించింది.
 
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: మిజోరం, భారతదేశ రాష్ట్రాలు రాజధానులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక