చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు.ప్రముఖ సినీగేయ రచయితలు చంద్రబోస్ మరియు మిట్టపల్లి సురేందర్ ఈ మండలానికి చెందినవారు. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. అదే సమయంలో ఈ మండలంలోని 16 గ్రామాలను విడదీసి కొత్తగా ఏర్పడిన పలిమెల మండలంలో కలిపారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఈశాన్యాన మల్హర్‌రావు మండలం, తూర్పున భూపాలపల్లి మండలం, దక్షిణా రేగొండ మండలం, పశ్చిమాన టేకుమట్ల మరియు మొగుళ్లపల్లి మండలం, ఉత్తరాన పెద్దపల్లి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 61621. ఇందులో పురుషులు 30412, మహిళలు 31209.
రాజకీయాలు:
ఈ మండలము భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాస పార్టీకి చెందిన దావు వినోద ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా తెరాస పార్టీకి చెందిన గొర్రె సాగర్ విజయం సాధించారు.
చిట్యాల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: Chain Paka, Challagarige, Chityal, Doothpalli, Giddemutharam, Gopalpur, Jadalapet, Jookal, Kailapur, Kalvapalli, Muchiniparthi, Nain Paka, Navabpet, Thirmalapur, Vencherami, Vodthala
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చల్లగరిగె (Challagarige): చల్లగరిగె జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన గ్రామము. ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ ఈ గ్రామానికి చెందినవారు. వెల్లంపల్లి (Vellampalli):
వెల్లంపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన గ్రామము. ప్రముఖ సినీగేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ఈ గ్రామానికి చెందినవారు.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Regonda Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి