రేగొండ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మండలము. మండలంలో 17 ఎంపీటీసి స్థానాలు, 37 గ్రామపంచాయతీలు, 18 రెవెన్యూ గ్రామాలు కలవు. భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి దక్షిణాన ఉంది. మండలం గుండా 353సి జాతీయ రహదారి వెళ్ళుచున్నది. అక్టోబరు 11, 2016న జిల్లాల పువర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి మారింది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం జిల్లాలో అతి దక్షిణాన ఉంది. ఈ మండలానికి ఉత్తరాన భూపాలపల్లి మండలం, ఈశాన్యాన ఘన్‌పూర్ ములుగు మండలం, వాయువ్యాన చిట్యాల మండలం, తుర్పున ములుగు జిల్లా, దక్షిణాన మరియు పశ్చిమాన వరంగల్ గ్రామీణ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 59901. ఇందులో పురుషులు 29915, మహిళలు 29986.
రాజకీయాలు:
ఈ మండలము భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాస పార్టీకి చెందిన పున్నం లక్ష్మి ఎన్నికైనారు. జడ్పీటీసి సభ్యునిగా తెరాస పార్టీకి చెందిన సైని విజయ విజయం సాధించారు.
రేగొండ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Bhagirthipet, Chennapur, Chinnakodepaka, Dammannapet, Jaggaiahpet, Jamshedbaigpet, Kanaparthy, Kodavatancha, Konaraopet, Kothapallegori, Lingala, Madathapalli, Ponagandla, Ramannaguda, Regonda, Repaka, Sultanpur, Tirumalagiri
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
గూడెపల్లి (Gudepalli): గూడెపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలమునకు చెందిన గ్రామము. జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన సాంబారి సమ్మారావు ఈ గ్రామానికి చెందినవారు. కనిపర్తి (Kaniparthy):
కనిపర్తి వరంగల్ జిల్లా రేగొండ మండలమునకు చెందిన గ్రామము. 2013, సెప్టెంబరు 12న కనిపర్తిలో నాగదేవత విగ్రహం బయటపడింది. సాయిబాబా గుడి నిర్మాణం కొరకు పెద్ద మర్రిచెట్టు తొలిగిస్తుండగా పెద్ద నాగుపాము బయటకు వచ్చింది. ఆ తర్వాత మూడు అడుగుల పొడవైన నాగవిగ్రహం బయటపడింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Regonda Mandal in Telugu, Jayashankar Bhupalapalli Dist (district) Mandals in telugu, Bhoopalapally Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి