25, ఆగస్టు 2020, మంగళవారం

గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad)

జననం
మార్చి 7, 1947
రాష్ట్రం/UT
జమ్మూకశ్మీర్‌
రంగం
రాజకీయాలు
పదవులు
ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి,
జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ మార్చి 7, 1947న జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లా భలెస్సాలో జన్మించారు. ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. స్థానిక కార్యకర్తగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయంగా ఉన్నత స్థానాలు చేపట్టారు.

1975లో జమ్మూకశ్మీర్ పిసిసి యువజన విభాగం అధ్యక్షుడిగా, 1980లో అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి 1980లో 7వ లోక్‌సభకు ఎన్నికై ఇందిరాగాంధీ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1984లో 8వ లోక్‌సభకు కూడా ఎన్నికైనారు. 1990-96 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు (మహారాష్ట్ర నుంచి ఎన్నిక). ఈ కాలంలో పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. ఆ తర్వాత 1996-2002, 2002-06 కాలంలో జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు ఎన్నికైనారు.

2005లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపటి మూడేళ్ళు పనిచేశారు. సంకీర్ణ ప్రభుత్వంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ మద్దతు ఉపసంహరించడంతో 2008లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2009-14 కాలంలో మన్‌మోహన్ సింగ్ మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి రాజ్యసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తున్నారు. భార్య శమీందేవి గాయనిగా పేరుపొందింది.
 
 
ఇవి కూడా చూడండి:
 
 


హోం
విభాగాలు:  జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులుగా పనిచేసినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక